ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , ముఖ్యమంత్రి వ్యవహారశైలిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ విభజన చట్టంలో పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారని, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే అడగని ప్రభుత్వం ఎందుకని అన్నారు. భూసేకరణ , పునారావాసంతో తమకు సంబంధం లేదంటున్నా సీఎం ఎందుకు ప్రశ్నించటం లేదన్నారు. ప్రజలు అనుకుంటున్నట్లు సీబీఐ కేసులకు భయపడుతున్నారా అని ఉండవల్లి పేర్కొన్నారు. పోలవరంకు రూ.20 వేల కోట్లు మాత్రమే ఇస్తామని, ఇంకా ఇవ్వవలసింది రూ.7 వేల కోట్లేనని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఏపీకి లేఖ రాసినట్లు ఉండవల్లి తెలిపారు. ఇది ఏపీ ప్రభుత్వానికి అవమానకరమంటూ ప్రాజెక్టు ఎత్తు ఎంతనే దాని కన్నా రిజర్వాయర్‌లో నీరు ఎంత ఉండాలనేది ముఖ్యమన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగటం లేదని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టును రాజ్యాంగ సమస్యగా మార్చి పెద్ద లాయర్లను పెట్టి గట్టిగా వాదనలు వినిపించాలని సూచించారు. చిన్న చిన్న కేసులకు రూ.కోట్లు ఖర్చు పెట్టి పెద్ద లాయర్లను నియమిస్తూ పోలవరం విషయాన్ని విస్మరించడం సరికాదన్నారు.
Also Read: వైసీపీ అగ్రనేతకు టీడీపీ ఎమ్మెల్సీ స్ట్రాంగ్ కౌంటర్











