ఏపీ రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నానిపై ఈ రోజు ఒక వ్యక్తి దాడికి యత్నించాడు. మచిలీపట్నంలోని ఆయన నివాసంలో జరగుతున్న తన తల్లి దశదిన కర్మకు అభిమానులు, బంధువులు వచ్చారు. ఇంతలో ఓ వ్యక్తి మంత్రి కాళ్లపై పడుతున్నట్టు ముందుకు వచ్చి తన వద్ద ఉన్న తాపీతో దాడి చేసేందుకు యత్నించాడు. దీంతో ఆయన అనుచరులు , గన్మెన్లు నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు తాపీ మేస్త్రి నాగేశ్వరరావుగా గుర్తించారు. దాడి చేసిన సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నట్లు తెలిపారు. భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకపోవడంతో అసహనానికి గురై దాడి చేసే ప్రయత్నం చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది.
Also Read: టీమ్ జగన్ 2.0: లోనికి ఎవరు? బయటికి ఎవరు?











