గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌కు ఆదివారం కేంద్రహోం మంత్రి అమిత్‌షా వచ్చారు. ఆయన పర్యటన నగరంలో కొనసాగుతోంది. గ్రేటర్‌లో బీజేపీ లక్ష్యంగా రోడ్‌షోలలో ఆయన ఈ రోజు పాల్గొననున్నారు. నగరానికి చేరుకున్న అమిత్‌షా నేరుగా చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులతో కలిసి రోడ్‌షోలలో పాల్గొంటున్నారు. మధ్యాహ్నం సికింద్రాబాద్‌లోని వారాసిగూడ నుంచి సితాఫల్‌మండి హనుమాన్ టెంపుల్ వరకు రోడ్‌షోలలో పాల్గొంటున్నారు. అనంతరం సనత్ నగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో రోడ్ షో లో పాల్గొన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో జోష్ మీదున్న బీజేపీ అమిత్‌షా పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం రెండు గంటలకు నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన పాల్గొంటారు. పార్టీ నాయకులతో పోలింగ్ రోజున కార్యాచరణపై సమీక్షిస్తారు. రాత్రి ఏడు గంటలకు తిరిగి ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిసింది. అయితే అమిత్ షా పర్యటనతో నగరంలో కేంద్ర బలగాలు దిగాయి. అమిత్ షా రాకతో బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి.











