చంద్రబాబు అంటేనే ఓ గొప్ప రాజకీయ వేత్త. పదవులు, అధికారం పక్కనబెడితే తిరుగులేని ఆయన రాజకీయ వ్యూహాలు తెలుగు ప్రజలే కాదు..దేశం ఇప్పటికీ ఎప్పటికీ మరచిపోదు. తలపండిన
పొలిటిషియన్లు సైతం ఆశ్యర్యపడేలా, అసూయ చెందేలా, ఉత్తరాది ఆధిపత్యాన్ని తెరదించుతూ
దక్షిణాదికి గుర్తింపు తెచ్చిన అగ్రనేత. చంద్రబాబు రాజకీయ చతురతకు ఎన్నో ప్రశంశలు మనకింకా
గుర్తుండే ఉంటాయి.
జగన్ సర్కార్ కుతంత్రాలతో రాజమండ్రి జైల్లో ఉన్నప్పటికీ చంద్రబాబు తన
రాజకీయ వ్యూహరచనతో పార్టీనేతలను, కేడర్ ను కొత్త ఉత్సాహంతో ఉరకలెత్తిస్తున్నారు. జనసేన పొత్తు ప్రకటించడంతో చంద్రబాబు రాజకీయం మరింత పదునెక్కింది. 2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని చిత్తుగా ఓడించి జగన్ ను గద్దె దింపేందుకు బ్రహ్మాండమైన పొలిటికల్ ప్లాన్ సిద్ధం చేశారు. అందులో భాగంగానే జనసేనాని నాలుగొ విడత వారాహి యాత్ర. చంద్రబాబు మాస్టర్ ప్లాన్ లో మొదటి అడుగులో భాగమే తెలుగుదేశం పార్టీకి పటిష్టమైన కేడర్ ఉన్న కంచుకోట లాంటి కృష్ణా జిల్లాలో పవన్ నాలుగో విడత వారాహి యాత్ర ప్రారంభమైంది. మొన్నటి దాకా అస్పష్టంగా ఉన్న పొత్తుల వ్యవహారం తేలిపోవండంతో జనసేనతో కలసి ఎన్నికలకు ముందు నుంచే కలసిపని చేయడం ద్వారా బంధాన్ని పటిష్ట పరిచేందుకు సిద్ధమయ్యారు. తమ పార్టీ నేతలను, శ్రేణులను కూడా వారాహి యాత్రలో పాల్గొనాల్సిందిగా ఆదేశాలవ్వడంతో అసలైన వ్యూహం.
ఈ వ్యూహం ద్వారా వైఎస్సార్సీపీకి చెక్ పెట్టడమే కాకుండా 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే జనసేనతో క లసి నేతల ఎంపిక, సర్దుబాటువంటి అంశాలపై క్లారిటీ తెచ్చే ప్రయత్నం చేయటం చంద్రబాబు వ్యూహమే. అలా చేయడం ద్వారా ముందే అసమ్మతిని గుర్తించటం… అలాంటి నేతలు పార్టీ జారిపోకుండా కాపాడుకోవచ్చని తెలుగుదేశం పార్టీ ఆలోచన. అవకాశమున్న చోట కొత్త నేతలకూ ఛాన్సిచ్చేందుకు ఇంత కంటే మంచి తరుణం మరొకటి ఉండకపోవచ్చని తెలుగుదేశం- జనసేన ఓ నిర్ణయానికొచ్చేశాయి.
సింహం ఎక్కడ ఉన్నా ఒకటే. తనను జైల్లో పెట్టించడం ద్వారా పార్టీని దెబ్బతీయాలన్న జగన్ వ్యూహాన్ని తిప్పికొడుతూ తెలుగుదేశం పార్టీ పునరుత్తేజానికి ఇంత కంటే మంచి తరుణం మరొకటి ఉండదనిపించేలా చంద్రబాబు జనజేనతో కలసి పార్టీ ని ముందుకు తీసుకెళుతున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ . అవనిగడ్డలో జరిగిన నాలుగో విడత వారాహి యాత్ర మొదటి రోజు సనసందోహం. తమలో సత్తా లేదనుకుంటే పొరపాటేనని టార్గెట్ 2024 గా తామూ పని చేస్తున్నామని వైఎస్సార్సీపికి ఓ సందేశం పంపిన చంద్రబాబు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లో ములాఖత్ సమయంలో చేసిన కీలకమైన సూచనలు అధికార సాధనలో ఉపయోగపడతాయని అంచనా.