చాలా రోజులు నిరీక్షణ అనంతరం షర్మిలకు గౌరవప్రద పదవీని అప్పగించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ లో ఎన్నికలు సమీస్తున్న వేళ.. రాజకీయ వ్యూహాలకు అన్నీ పార్టీలు పదును పెంచుతున్నాయి. బీఆర్ఎస్ ఈసారి ఇంటికి పంపే వ్యూహంలో కాంగ్రెస్ కు కలిసొచ్చే అన్నీ అంశాల్లో ఆచి తూచి అడుగులు వేస్తోంది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న షర్మిల.. తన అన్న.., ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను విభేదించి.. తెలంగాణ లో సొంతగా పార్టీని స్థాపించి.. కేసీఆర్ పై యుద్ధం ప్రకటించారు. విద్యార్ధి సమస్యలు.., ఉపాధిపై ధ్వజమెత్తారు. దీక్షలు పేరుతో కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ వచ్చారు. అయితే కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తరువాత ఆమె కొంచెం స్లో అయ్యారు. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో షర్మిల భేటీ అయ్యారు. ఆ తరువాత ఢిల్లీ లో సోనియా.., రాహుల్ తో భేటీ అయ్యారు. ఆ తరువాత తెలంగాణ కాంగ్రెస్ లో సీన్ మారింది. పార్టీ సీనియర్లందరూ షర్మిల రాకను వ్యతిరేకించారు.
పాలేరు టికెట్ ను ఆశించిన షర్మిలకు శృంగభంగం తప్పలేదు. ఈ నేపథ్యంలోనే నెల 15 రోజులుగా షర్మిల రాజకీయంగా స్లో అయ్యారు. ఆ మధ్య తెలంగాణ లో కాంగ్రెస్ అధిష్టానం నిర్వహించిన సీడబ్లూసీ సమావేశం…, తుక్కుగూడ లో కాంగ్రెస్ బహిరంగ సభలో కూడా షర్మిలకు ఆహ్వానం అందలేదు. దీంతో షర్మిలకు కాంగ్రెస్ పార్టీకి రాం.. రాం .. అన్న కామెంట్స్ పెద్దఎత్తునే వినిపించాయి.
ఈక్రమంలో సోమవారం అనూహ్యంగా షర్మిల పేరు ఢిల్లీ లో తెరపైకి వచ్చింది. రేపే ఢిల్లీకి వచ్చి కలవాలంటూ కాంగ్రెస్ అధిష్టానం పిలుపునిచ్చింది. అంతేకాక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం తరువాత కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక ఉన్న సమాన హోదాను షర్మిలకు కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అలానే కాంగ్రెస్ పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ తోపాటు ఖమ్మం లోక్ సభ సీటును కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ ఇచ్చిన బంపర్ ఆఫర్లకు షర్మిల కొంతమేరకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రేపు కానీ.. ఎల్లుండు కానీ ఢిల్లీ వెళ్లి.. సోనియా సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పు కోవడం ఖాయమని తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టీపీ విలీనం ఇక అనివార్యమే.