ఫరియా అబ్దుల్లా పేరు ఈ మధ్య కాలంలో బాగా వినిపించింది. ‘జాతిరత్నాలు‘ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో మెరిసిన ఈ అమ్మాయి, తన గ్లామర్ తో యూత్ హృదయాలను కొల్లగొట్టేసింది. చక్కని కనుముక్కుతీరు .. చక్కర కలిపినట్టుగా అనిపించే చిక్కనైన నవ్వు ఈ అమ్మాయి ప్రత్యేకతగా కనిపిస్తాయి. ఫరియా మంచి పొడగరి .. ఆమె హైటు ఆమెకి ప్రత్యేకమైన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ‘జాతిరత్నాలు’ సినిమాకి ముందు అందరూ మాట్లాడుకున్నది ఈ సుందరి హైటు గురించే.
ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో ఫరియాను చూసిన ప్రభాస్, ఆమె హైటును గురించి ప్రస్తావించాడు. దాంతో అందరి దృష్టి ఈ అమ్మాయివైపు వెళ్లింది. మంచి హైటూ .. అందుకు తగిన పర్సనాలిటీతో సహజంగానే ఈ అమ్మాయి అందరి మనసులను తనవైపుకు తిప్పుకుంది. ఈ సినిమా హిట్ కావడంతో కూడా అమ్మడి గ్లామర్ కి కలిసొచ్చింది. ఆ తరువాత బుల్లితెరపై ఏ షో చూసినా, గెస్టుగా ఫరియా సందడే కనిపించింది. ఇక ఈ అమ్మాయికి వరుసగా అవకాశాలు వచ్చేస్తున్నాయనే ప్రచారం జోరుగా సాగింది.
అయితే ఇంతవరకూ ఫరియా ఫలానా సినిమాలో నాయికగా అవకాశాన్ని అందుకుందనే వార్త ఒక్కటీ అధికారికంగా రాలేదు. కొత్తగా సెట్స్ పైకి వెళ్లే ప్రాజెక్టులలో ఎక్కడా ఆమె పేరు వినిపించడం లేదు .. కనిపించడం లేదు. ఫరియా హైటు అందరినీ ఎంతలా ఆకర్షించినప్పటికీ, అవకాశాలు దగ్గరికి వచ్చేసరికి కొన్ని సార్లు అడ్డుపడే ఛాన్స్ ఉంది. మరీ ఎక్కువ హైటు ఉండటమే అవకాశాలు వెతుక్కుంటూ రాకపోవడానికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Must Read ;- శిల్ప సుందరి ‘హంగామా’ బెడిసికొట్టింది!











