నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి.. ముఖ్యపాత్రల్లో అనుదీప్ కెవీ దర్శకత్వంలో .. నాగ్ అశ్విన్ నిర్మాణంలో రూపొందిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘జాతిరత్నాలు’. దాదాపు 40కోట్ల షేర్ ను రాబట్టి రికార్డు నెలకొల్పిన ఈ సినిమా ఓవవర్సీస్ లో సైతం దుమ్ము రేపేసింది. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా .. తెలంగాణలోని జోగిపేట్ కు చెందిన ఓ ముగ్గురు కుర్రోళ్ళు.. ఉద్యోగం సంపాదించడానికి హైద్రాబాద్ పయనమై.. అక్కడో మర్డర్ కేసు లో ఇరుక్కోవడం.. చివరికి తమ ఇన్నోసెన్స్ ను ప్రూవ్ చేసుకోవడం ఈ సినిమా కథాంశం. అలాంటి ఈ హిలేరియస్ కామెడీ మూవికి ఇప్పుడు సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నారు మేకర్స్.
నిర్మాత నాగ్ అశ్విన్, దర్శకుడు అనుదీప్ కేవీ ‘జాతిరత్నాలు 2’ సినిమా కథాంశాన్ని రీసెంట్ గా ఫైనలైజ్ చేశారట. మర్డర్ కేసు నుంచి బైటపడిన ముగ్గురు స్నేహితులు.. జోగిపేట్ వచ్చేసి ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతుండగా.. ఈ ముగ్గురికీ యూఏస్ వెళ్ళే అరుదైన అవకాశమొస్తుందట. కష్టపడి అమెరికా పయనమైన ఈ మిత్ర బృందం అక్కడ అనుకోని చిక్కుల్లో పడతారట. చివరికి ఆ తలనొప్పి నుంచి ఎలా బైట పడతారు అనేదే ‘జాతిరత్నాలు 2’ లైన్ అని తెలుస్తోంది.
అతి త్వరలో ‘జాతిరత్నాలు 2’ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది. జూన్ లో గానీ, జూలై లో గానీ సినిమాను లాంఛ్ చేయాలన్నది మేకర్స్ ఆలోచన. ఇక ఈ భాగంలో కూడా ఫరియా అబ్దుల్లా పాత్ర, ఆమె తండ్రిగా నటించిన నరేశ్ పాత్రలు కూడా కంటిన్యూ అవుతాయట. అలాగే.. నవీన్ పోలిశెట్టి తండ్రి గా నటించిన తనికెళ్ళ భరణి పాత్ర కూడా కంటిన్యూ అవుందని తెలుస్తోంది. మరి ‘జాతిరత్నాలు 2’ సినిమా మొదటి భాగాన్ని మించి సక్సెస్ అవుతుందేమో చూడాలి.