వర్షాకాలంలో వాతావరణ పరిస్థితులు ఒక్కోరోజు ఒక్కో విధంగా ఉంటాయి. వర్షం పడిన రోజున గాలిలో తేమ అధికంగా ఉండి చలిగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలపై ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందుకే పసిపిల్లలను దోమతెరలోనే పడుకో పెడుతుండాలి. వీలైనంత వరకూ మస్కిటో కాయిల్స్ ఉపయోగించవద్దు. ఇంట్లో పెద్దవాళ్లు ఎవరికైనా జలుబు చేసినట్లయితే నోటిని, ముక్కును బట్టతో కప్పుకోవాలి. వీలైనంత వరకు బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లని వాతావరణంతో ఫ్లూ ముప్పు పొంచి ఉంది. వైద్యుల సలహా మేరకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.
ఈ జాగ్రత్తలు ముఖ్యం
ఇల్లు వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఇంట్లోకి గాలి, వెలుతురు వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈగలు, దోమలు ముసిరే ప్రాంతాల్ని వెంటనే శుభ్రం చేయాలి. వర్షాకాలంలో వెచ్చటి దుస్తులు మాత్రమే ధరించాలి. ప్రతిరోజు బట్టలను మారుస్తూ ఉండాలి. వేడి ఆహారం తీసుకోవాలి. 48 గంటలకు మించి జ్వరం ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.
ముఖమైన సూచనలు
- వేడిచేసి చల్లార్చిన నీరు తాగాలి
- పండ్లు, కూరగాయాలు, పాలు, చపాతీలు ఎక్కువగా తీసుకోవాలి.
- ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
- నిమ్మరసం, బార్లీ, మజ్జిగ, గ్లూకోజ్ తరుచూ తాగాలి.
- ఒక లీటర్ నీటిలో చెంచా ఉప్పు, నాలుగు చెంచాల పంచదార కలిపి తాగించాలి.
వీటికి దూరంగా ఉండాలి
వర్షాకాలం మొదలవగానే చాలామంది వేడి వేడి స్నాక్స్ తినడానికి ఇష్టం చూపుతారు. ముఖ్యంగా ఈ విధంగా నూనెలో వేయించిన ఆహార పదార్థాలను తినడం మానుకోవాలి. అదేవిధంగా ఆకుకూరలకు ఎక్కువగా బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇన్ఫెక్షన్ సోకిన ఆకుకూరలను తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది. వీలైనంత వరకు ఆకుకూరలను తక్కువగా తీసుకోవడం ఉత్తమం.
Must Read ;- వంటింట్లోనే ఆరోగ్యం..!