మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఆయనను హైదరాబాద్ గచ్చిబౌలిలోని AIG హాస్పిటల్కు తరలించారు. గ్యాస్ట్రిక్ సమస్యతో హాస్పిటల్లో చేరిన నానికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు..ఆయనకు గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఐసీయూలో నానికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రెండు వారాల తర్వాత ఆపరేషన్ చేస్తామని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది.
జగన్ కేబినెట్లో మంత్రిగా పని చేసిన కొడాలి నాని..అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై బూతులతో విరుచుకుపడేవారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు నాని. అప్పటి నుంచి సైలెంట్ అయిపోయారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా కనిపించడం లేదు. ఇటీవల గుంటూరు మిర్చి యార్డులో జగన్ పర్యటనలో చివరిసారిగా కనిపించారు. వంశీ అరెస్టయిన టైంలో నెక్ట్స్ కొడాలి నానినే అరెస్టు చేస్తారన్న ప్రచారం జరిగింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాని వ్యవహారంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. పౌరసరఫరాల శాఖలో అవినీతి, దాంతో పాటు జగనన్న కాలనీల్లో మెరక పేరుతో అక్రమంగా చేపట్టిన మట్టి తవ్వకాలపై విచారణ ఇప్పటికే మొదలైంది. బియ్యం అక్రమ రవాణాతో వేల కోట్లు సంపాదించారని నానిపై టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దాంతో పాటు అక్రమంగా మట్టి తవ్వకాలతో వందల కోట్ల ప్రజాధనాన్ని నొక్కేసారని చెప్తున్నారు.