ఇండస్ట్రీలో సరైన హిట్ వస్తే చాలు ఓవర్ నైట్ పాపులర్ అయిపోవచ్చు. సక్సెస్ కి ఉన్న క్రేజ్ సినిమా పరిశ్రమల్లో చాలా వేగంగా వ్యాపిస్తోంది. అప్ కమింగ్ హీరో కార్తికేయ కూడా ఆర్ ఎక్స్ 100 అనే అడల్ట్ కంటెంట్ సినిమాతో యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ తెచ్చేసుకున్నాడు. పిల్లా రా అంటూ కార్తికేయ, హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ తో చేసిన రొమాన్స్ సీన్స్ కుర్రాళ్లకి ఫుల్ కిక్ ఇచ్చాయి. అయితే ఆర్.ఎక్స్. 100 తరువాత కార్తికేయకు సరైన హిట్ లేదు.
ఇప్పటికీ కార్తికేయను ఆర్స్ ఎక్స్ 100 హీరోగానే గుర్తిస్తారు జనాలు. మొత్తం నాలుగు సినిమాల్లో నటించిన ఈ రైజింగ్ హీరోకి కేవలం ఒక్క హిట్ మాత్రమే ఉంది. దీంతో ఇప్పుడు హిట్ కోసం ఈ కుర్ర హీరో పరితపిస్తున్నాడట, ఆర్ ఎక్స్ 100 ప్రభావంతో కార్తికేయతో ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ వారు సినిమా చేయడానికి ముందుకు వచ్చాయి. జీఏ2 పిక్చర్స్ పై కార్తికేయను హీరోగా పెట్టి చావు కబులు చల్లగా అనే సినిమాను తీస్తున్నారు మెగా కాంపౌండ్ లోని నిర్మాత బన్నీ వాసు.
ఈ సినిమాలో కార్తికేయ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. కార్తికేయ ఈ సినిమాలో శవాల బండికి డైవర్ గా నటిస్తున్నాడు. ఇదో రా రస్టిక్ స్టోరీతో రెడీ అయిందని గీతా వర్గాలు చెబుతున్నాయి. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ముగించి, పరిస్థితిని బట్టి ఓటిటి రిలీజ్ లేదా థియేటర్ రిలీజ్ చేయలానే ప్లాన్ లో నిర్మాత బన్నీ వాసు ఉన్నట్లుగా సమాచారం. ఈ సినిమా సక్సెస్ పైనే కార్తికేయ కెరీర్ డిసైడ్ ఉంది. ఒకవేల పొరపాటున ఫ్లాప్ అయితే మాత్రం కార్తికేయ రిజెక్ట్ హీరోల లిస్ట్ లో చేరిపోతాడు.











