రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పురపాలక సంఘాల్లో సిబ్బంది కొరత విపరీతంగా వుంది. దీంతో సమస్యలు పేరుకుపోతున్నాయి. చిన్న పనులకు పట్టణప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించి సత్వర సేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో వార్డుకు ఒక అధికారిని నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆ శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల ఉన్నత స్థాయి సమీక్షలో వెల్లడించారు. వారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి, సమస్యలను పరిష్కరించనున్నారని పేర్కొన్నారు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
సగం సిబ్బంది లేరు
రాష్ట్రంలో పురపాలక సంఘాలు ఉన్న వాటిలో సిబ్బంది కొరత విపరీతంగా వుంది. పట్టణాల్లో ఉన్న పురపాలక సంఘాల్లో అన్ని రకాల విభాగాల్లో కలిపి కనీసం 100 వరకు సిబ్బంది ఉంటారు. వీరిలో 50 మంది సిబ్బంది లేరు. సాదరంగా ఇంజనీరింగ్. పారీ శుద్ద ము, పట్టణ ప్రణాళిక. నీటి సరఫరా. రెవెన్యూ విభాగాలు ఉంటాయి. కొన్ని పురపాలికల్లో ఓ విభాగంలో 4 గురు అధికారులు ఉండాల్సి ఉండగా ఒక్కరే ఉన్నారు. ఇక కొత్తగా గత సంవత్సరం పురపాలక సంఘాలను ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ గా ఉన్న వాటిని మున్సి పాల్టిగా మార్చారు. వీటిలో సదుపాయాలు కల్పించలేదు. అధికారులను నియమించ లేదు.
పురపాలికలు రోజు రోజుకు విస్తరిస్తున్నాయి. జనాభా అదే స్థాయిలో పెరుగుతోంది. కొత్తకాలనీలు ఏర్పాటవుతున్నాయి. ప్రజలు అధికమవుతున్నా సరిపడా సిబ్బంది, అధికారులు మాత్రం లేరు. వార్డు అధికారుల నియామకం జరిగితే సమస్యలు పరిష్కారమయ్యేందుకు మార్గం సుగమం కానుంది. కొత్తగా పురపాలికల్లో 2298 మంది వార్డు అధికారులను నియమించాల్సి ఉంటుంది. వీరు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా ఉంటారు.
సేవలు, సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతగా అమలు చేసేందుకు కృషి చేయనున్నారుఅధికారులు కొరతతో ప్రజలు వార్డు కౌన్సిలర్లును ఆశ్రయిస్తున్నారు. వీరు తమకు అనుకూలమైన వారికే పనులు చేసి పెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వార్డు అధికారులను నియమించడం ద్వారా ప్రజల ఇబ్బందులు తొలగనున్నాయి. వార్డు అధికారులను సత్వరమే నియమించాలని ఆయా పురపాలక సంఘాల ప్రజలు కోరుతున్నారు.











