తెలుగు పరిశ్రమలో ప్రస్తుతం వారసుల హవా కొనసాగుతోంది. అయితే ఈ బ్యాచ్ లో మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన వారసులే ముందంజలో ఉన్నారు. మిగతా వారు అడపాదడపా సినిమాలు చేస్తున్న స్టార్ రేంజ్ కి మాత్రం చేరుకోలేకపోతున్నారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున కాకుండా ఏకంగా నలుగురు హీరోలు ఉన్నారు. వీరిలో సుమంత్ 20 ఏళ్ల కిందటే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సరైన హిట్ కోసం ఇంకా దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. సమంత్ కెరీర్ లో ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేకపోవడం గమనార్హం.
ఇరవై ఏళ్లుగా సమంత్ అప్ కమింగ్ హీరోల జాబితాలోనే ఉండిపోయాడు. ఇక సుమంత్ కి పోటీగా ఇదే కాంపౌండ్ నుంచి సుశాంత్ కూడా పదేళ్లు క్రితం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మనోడికి కూడా ఒక్క బ్లాక్ బస్టర్ లేదు. జస్ట్ బావుందనే సినిమాలు మాత్రమే ఉన్నాయి. అయితే సుశాంత్ కి ఈ ఏడాది అల వైకుంఠపురంలో సినిమాతో ఓ ఇండస్ట్రీ హిట్ దక్కింది. అయితే ఈ క్రెడిట్ మనోడు తీసుకోవడానికి లేదు, ఎందుకంటే అల వైకుంఠపురంలో సుశాంత్ డైలాగ్స్ పెద్దగా లేని ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు.
అయితే ఈ సక్సెస్ కారణంగా సుశాంత్ కి సినిమాలు రాకపోయినప్పటికీ లోకల్ గా బ్రాండ్ అండార్స్ మెంట్స్ వస్తున్నాయి. ప్రఖ్యాత డ్రింక్ కి తెలుగు రాష్ట్రాల్లో ప్రచాకర్తగా వ్యవహరించేందుకు సుశాంత్ తాజాగా డీల్ కుదుర్చుకున్నాడని తెలిసింది. ఇప్పటికే ఈ డ్రింక్ కి సంబంధించిన యాడ్ స్పాట్స్ టీవీలో వస్తున్నాయట, ఏదైతేనేం సుశాంత్ కి కనీసం యాడ్స్ అయినా వస్తున్నాయి. కానీ సుమంత్ మాత్రం కెరీర్ లో స్పీడ్ గా ముందుకు వెళ్లలేకపోతున్నాడు. ప్రస్తుతం సుమంత్ ‘కపటధారి’ అనే సినిమాలో నటిస్తున్నాడు. సుశాంత్ ‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలు రెండూ డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో రిలీజయ్యే అవకాశం ఉందని సమాచారం.











