తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ దగ్గరపడుతున్న వేళ.. రాజకీయాలు వ్యూహప్రతివ్యూహాలతో వేడెక్కుతున్నాయి. శుక్రవారం షర్మిల మీడియాకు ఇచ్చిన మేసేజ్ హాట్ టాపిక్ మారింది.
వైఎస్ఆర్టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు.., దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కూతురు షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సాధారణ ఎన్నికల్లో తాను కానీ.., తన పార్టీ కానీ.. బరిలో నిలవడం లేదని ప్రకటించారు. అంతేకాక బేషరతుగా కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. మీడియా ముఖంగా షర్మిల వ్యాఖ్యలు తెలంగాణ గడ్డపై హాట్ టాపిక్ గా మారింది.
జగనన్న వదిలిన బాణంగా చెప్పే వైఎస్ షర్మిల.. రాజకీయంగా సంకట స్ధితిని ఎదుర్కొంటుంది. ఆనాడు తండ్రి వైఎస్ఆర్ ముఖ్యమంత్రి.., నేడు అన్న జగన్ ఏపీలో ముఖ్యమంత్రి.. ఆనాడు ఏమో కానీ.. తండ్రి మరణాంతరం అన్న కోసం.., కుటుంబం కోసం షర్మిల చేసిన త్యాగం నేటికీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు గుర్తుంచుకుంటారు. తెలంగాణలో 3 వేలకు పైగా పాదయాత్ర చేసి..400 కుటుంబాలను ఆమె ఓదార్చారు. ఖమ్మం జిల్లా పాలేరు పోటీ చేస్తున్న పొంగులేటి సైతం షర్మిల పాదయాత్రకు అన్నీ తానై చూసుకున్నారు. 2014 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్ సీపీకి రెండు ఎమ్మెల్యే స్థానాలు.., ఒక ఎంపీ స్ధానాన్ని సైతం కౌవసం చేసుకున్న విషయం తెలిసిందే. అందుకే ఖమ్మం ప్రజలు.., ముఖ్యంగా పాలేరు తో షర్మిలకు విడదీయరాని బంధం ఉంది.
వైఎస్ఆర్టీపీ నుంచి తాను ఎన్నికల బరిలో ఉన్నాని చెప్పుకొచ్చిన షర్మిల …. అప్పట్లో పార్టీని సైతం కాంగ్రెస్ లో విలీనం చేసి.. పాలేరు నుంచి బరిలో దిగాలనుకున్నారు. దీనిని ఆమె స్వయంగా మీడియాకు చెప్పారు. అప్పటి నుంచి వైఎస్ఆర్టీపీ కేడర్ లోని ముఖ్యనాయకులు షర్మిలకు దూరమయ్యారు. నిన్న రాత్రి లోటస్ పాంట్ లోని షర్మిల ఇంటి వద్ద కూడా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు పార్టీ అమ్ముకుంది అని నినాదాలు చేశారు.
ఈ నేపధ్యంలో షర్మిల వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటూ.. బేషరతుగా కాంగ్రెస్ తన పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు తెర తొలగించి మరి కుండబద్దలు కొట్టింది. పార్టీ పోరాడాల్సిన సమయం ఇంకా ఉందని.., ఈ ఎన్నికలకు కాంగ్రెస్ తో కలిసి ప్రయాణం చెద్దామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలితే .. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతాడని .. అలా జరగకుండా ఉండడానికే తాను కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు షర్మిల ప్రకటించింది. ఇదిలా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. షర్మిలకు పార్టీలోనూ.., ప్రభుత్వంలోనూ ప్రాధాన్యత కల్పించేలా పార్టీ పెద్దలు షర్మిలకు హామీ ఇచ్చినట్లు సమాచారం. మొత్తంగా షర్మిల రాజకీయ జీవితం నాటకీయంగా ముగిసినా.. ఆమె చేసిన త్యాగం ఫలాలను ఇస్తోందని ఇప్పటికే విశ్లేషణలు ఊపందుకున్నాయి.