ఇసుక విషయం నాలుగునరేళ్ళు ఏపీ ప్రజలు నరకం చవిచూస్తున్నారు. దాదాపు వేల కుటంబాలు ఉపాధిని కోల్పొయి రోడ్డు పడ్డారు.
ఏపీ ప్రజలు ఏ జన్మలో ఏం పాపం చేసుకుంటే ఇటువంటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రూపంలో దొరికాడని సోషల్ మీడియా వేదికగా నిత్యం ప్రజలు తిట్టిపోస్తున్న పోస్టింగ్స్ లను కోకొల్లలుగా చూస్తునే ఉన్నాం. తండ్రి వైఎస్ఆర్ బాటలో తాను సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అందిస్తాడని ఆశించి.. ఒక్క ఛాన్స్ ఇచ్చారు. అదే ఏపీ ప్రజల పాలిట శాపంగా మారింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తొలిరోజే .. ఇసుకను బ్లాక్ చేశారు. సహజ వనరుగా ఉన్న ఇసుకను బంగారంలా మార్చి ఆంక్షాలు విధించారు. ఈ నాలుగేళ్ళల్లో దాదాపు రూ. 40 వేల కోట్లు దోచుకున్నారు. ఇది సోషల్ మీడియాలో సాక్ష్యాలతో సహ చూపిస్తున్న రుజువులే. దాదాపు 40 లక్షల నిర్మాణ కార్మికుల ఉపాధిపై దెబ్బకొట్టారు. వారి జీవనోపాధిపైనే కాకుండా వారి జీవితాలను రోడ్డు కీడ్చారు. ఇది సోషల్ మీడియానే కాదు సర్వేలు చెప్తున్న వాస్తవాలు.
వ్యవసాయం తరువాత అత్యధిక ఉపాధి మార్గంగా ఉన్న నిర్మాణ రంగం ఇసుక బ్లాక్ తో రోడ్డున పడగా.. దీనికి అనుబంధంగా ఉన్న మరో 125 వృత్తుల వారు జీవనోపాధిని దెబ్బతీశాడు జగన్ రెడ్డి. ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తొలిరోజు నుంచే పాత విధానంలో ఉన్న ఇసుక పాలసీని రద్దు చేసి.. ఇసుకను బ్లాక్ చేశారు. దీంతో దాదాపు నాలుగేళ్ళల్లో వందలాది మంది భవన కార్మికుల ఆత్మహత్యలకు కారకుడయ్యారు జగన్ రెడ్డి.
గతంలో తెలుగు దేశం పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇసుకను ఫ్రీగా అందజేశారు. ఏపీలో నిర్మాణ రంగం పరుగులు పెట్టింది. నిర్మాణ రంగానికి అనుబంధంగా ఉన్న 125 రంగాలు ఆర్ధిక వృద్ధిని సాధించాయి. ఏపీలో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం సంస్థలు వేగంగా పుంజుకున్నాయి. దీంతో 40 లక్షల మందికి ఉపాధి అవకాశాలు మెండుగా అందాయి. రాష్ట్రంలో ఉపాధి.., ఉగ్యోద అవకాశాలు పుంజుకోవడంతో కొనుగోలు శక్తి కూడా అమాంతం పెరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ రంగాలు ఆర్ధికంగా బలపడ్డాయి. అది ముఖ్యమంత్రి హోదాలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ట్రాక్ రికార్డు. సంపద సృష్టించడం.., ఉపాధిని పెంచడం.. ఉద్యోగ అవకాశాలను పెంపొందించడం ఆయనకు తెలిసిన రాజనీతి. అందుకే ఇసుక ఫ్రీ సిస్టమ్ ను తీసుకొచ్చి ప్రజలకు అందించాడు. దీంతో ఏపీ ఏ స్థాయిలో సర్వతోముఖాభివృద్ధిని సాధించిందో ఆనాడు ప్రజలు కళ్లారా చూశారు.
ఇదే ప్రజలు జగన్ రెడ్డికి ఓటేసిన నేరానికి.. నేడు ఏపీ వినాశనాన్ని చూస్తున్నారు. వేధనలు భరిస్తూ అనుభవిస్తున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డిల మధ్య ఉన్న దార్శినికత తేడాను గుర్తించి సర్వం కోల్పొయామని నేడు తలలు పట్టుకుంటున్నారు. ఇసుకపై అడ్డగోలు ఆంక్షాలు విధించి దోచుకుంటే.. ప్రజలు నష్టపోవడం తోపాటు అనేక రంగాలు కుంటుపడి ఉపాధి,ఉద్యోగావకాశాలు కోల్పొతామని జగన్ రెడ్డికి తెలియాదా..? తద్వారా ప్రజల్లో వ్యతిరేకత పెరిగి..చివరికి గద్దెదిగాల్సి వస్తోందన్న చిన్నపాటి లాజిక్ ను జగన్ ఎలా మిస్సైయ్యాడు..? అని విశ్లేషణలు లేకపోలేదు.