నెల్లూరు జిల్లా దుత్తలూరు దశ తిరగనుంది. హైదరాబాద్ బేస్డ్‌గా పని చేస్తున్న అనంత్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దుత్తలూరు మండలం చింతలగుండ దగ్గరం ఏకంగా రూ.1000 కోట్లతో ఓ భారీ ఇండస్ట్రీని సెటప్ చేయబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే గవర్నమెంట్ నుంచి అనుమతి కూడా వచ్చేసింది. శనివారం రోజున ఆ కంపెనీ డైరెక్టర్లు, APIIC అఫీషియల్స్, రెవెన్యూ స్టాఫ్‌తో కలిసి ఫ్యాక్టరీని నెలకొల్పే భూములను ఫీల్డ్ లెవెల్‌లో ఇన్‌స్పెక్ట్ చేశారు.
డిఫెన్స్ సెక్టార్‌కు సంబంధించి కీలకమైన ఆయుధాల తయారీ ఇక్కడ జరగనుంది. ప్రధానంగా మిస్సైల్స్ ,మందుగుండు సామాగ్రి, సూసైడ్ డ్రోన్ల తయారీతో పాటు వాటి అసెంబ్లింగ్, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ లాంటి పనులు ఈ ప్లాంట్‌లోనే కండక్ట్ చేయనున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్ కోసం దుత్తలూరు రెవెన్యూ పరిధిలో ఇప్పటికే 300 ఎకరాల ల్యాండ్‌ను అలాట్ చేశారు.
ఈ ఫ్యాక్టరీ ద్వారా ఉపాధి అవకాశాలు భారీగానే రానున్నాయి. ఈ ఇండస్ట్రీ స్టార్ట్ అయితే.. డైరెక్ట్‌గా 750 మందికి, ఇన్‌డైరెక్ట్‌గా మరో 1000 మందికి పైగా ఎంప్లాయ్‌మెంట్ దొరుకుతుందని అఫీషియల్స్ ఎస్టిమేట్ చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ సెటప్‌ను మొత్తం రెండు ఫేజ్‌లలో కంప్లీట్ చేయనున్నారు. ఫస్ట్ ఫేజ్ వర్క్స్‌ను 24 నెలల్లో, సెకండ్ ఫేజ్‌ను 48 నెలల్లో పూర్తి చేసేలా టార్గెట్ ఫిక్స్ చేసినట్లు అధికారులు క్లారిటీ ఇచ్చారు.
డిఫెన్స్, ఏరో స్పేస్ రంగంపై ఏపీ సర్కార్ ఫోకస్ చేసింది.. అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద ఏపీ ఏరోస్పేస్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ పార్క్ కోసం సుమారు 246 ఎకరాల భూమిని కేటాయించారు. డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ రంగంలో రూ. 500 కోట్ల వరకు పెట్టుబడులతో పాటు వివిధ సంస్థలు ఇక్కడ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఇటీవల, ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌కి శంఖుస్థాపన జరిగింది.. మొత్తమ్మీద, రక్షణ రంగ పరిశ్రమలు సైతం ఏపీకి క్యూ కడుతున్నాయి.. కూటమి దూకుడుకి ఇది నిదర్శనం..











