రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి ఎక్కువవుతోంది పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఆదివారం ఉదయం వరకు ఒక్కరోజులో 10603 కేసులు నమోదు అయ్యాయి. అందులో ముఖ్యంగా తూర్పుగోదావరి , నెల్లూరు జిల్లాలలో అత్యధిక సంఖ్యలో 1000 పైగా కేసులు నమోదైనట్లు నోడల్ అధికారి డాక్టర్ అర్జా శ్రీకాంత్ తెలియజేశారు. ఈ ఒక్కరోజులోనే 88 కొవిడ్ మరణాలు సంభవించాయి. అత్యధికంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాలో నమోదు అయ్యాయి.
నాకు రాదు అని నిర్లక్ష్యంగా మాస్కులు ధరించ కుండా, భౌతిక దూరం పాటించకుండా ఎప్పటికప్పుడు చేతులు కాళ్లు శుభ్రపరుచు కోకుందా ఉన్నట్లయితే వీధిలోనే ఉన్న కొరోనా ను ఒంటిలోని కి ఇంట్లోని కి తెచ్చుకున్నట్లే అని శ్రీకాంత్ అన్నారు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అని, అవసరమైతే తప్ప ఎవరూ బయటకు వెళ్ళవద్దని ఆయన కోరారు.












