సన్నీ లియోన్ అంటే తెలియని నెటిజనులు లేరు. సన్నీ పోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ స్టార్ అయినా గూగుల్ సెర్చ్ లో గుటకలు మింగే కుర్రకారు హంట్ తగ్గలేదు. తెలుగు లో కూడా ‘ కరెంటు తీగ ‘ , ” గరుడ వేగ ‘ సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసింది సన్నీ లియోన్. ఈ మధ్య మరో రకంగా కూడా వార్తల్లోకి ఎక్కింది. కలకత్తాలో అశుతోష్ కాలేజీ అని ఒకటి ఉంది . బీఏలో జాయిన్ కావడానికి మెరిట్ స్టూడెంట్స్ లిస్ట్ కాలేజీ బోర్డు లో డిస్ ప్లే పెట్టారు. అందులో నెంబర్ వన్ గా వచ్చిన స్టూడెంట్ ఎవరో తెలుసా ? ఇంకెవరు సన్నీ లియోన్ .
12 వ తరగతిలో 400 వందల మార్కులు తెచ్చుకుని బీఏలో చేరడానికి అర్హత సాధించింది. కాలేజీ బుల్లోడు’ సినిమాలో అక్కినేని లాగా సన్నీ లియోన్ కాలేజీ లో ఈ ఏజ్ లో చేరడం ఏంటి ? కుర్రాళ్ళు అంతా సన్నీ హాట్ వీడియోలు చూస్తూ చదువులు చెడగొట్టుకోవడం ఏంటి ? సన్నీ మాత్రం బుద్దిగా చదువుకుని ఫస్ట్ రాంక్ తెచ్చుకోవడం ఏంటి ? అని అందరూ హర్ట్ అయ్యారు. కాలేజీ స్టూడెంట్స్ గొడవ చేశారు. తమకు తెలియకుండా సన్నీ ఇక్కడ చదువుకోవడం ఏమిటనేది వారి ప్రశ్న. తర్వాత తెలిసింది ఆ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసిన వాడు సన్నీ లియోన్ ఫ్యాన్ అట. నిరంతరం సన్నీ జపం చేస్తూ లిస్ట్ లో నెంబర్ వన్ ప్లేస్ ఇచ్చేశాడు.