స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తరువాత ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకవైపు టీడీపీ శ్రేణులు.., సామాన్య ప్రజలు సైతం చంద్రబాబుపై నమోదు చేసింది అక్రమ కేసు అని.. బాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న క్రమంలో జనసేనాని పొత్తుతో ముందుకెళ్లేందకు కలిసి వచ్చాడు. దీంతో ఇటు అధికారి వైసీపీతో పాటు .. రెండు తెలుగు రాష్ట్రాలు.., ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో పొత్తుల రాజకీయ చర్చ హాట్ టాపిక్ గా మారింది.
రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ములాఖత్ అనంతరం రాజమండ్రిలో తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. త్వరలో టీడీపీ.., జనసేన పొత్తుతో ఐక్యకార్యాచరణ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు సూచనలు మేరకు న్యాయపోరాటం చేసేందుకు ఉమ్మడి నిర్ణయాలు చేస్తున్నామని.. అరెస్ట్ లకు భయపడేదే లేదన్నారు లోకేష్. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఇరు పార్టీలు కలిసే ఎండగట్టి.. ప్రజలకు వివరిస్తామన్నారు.
28 రోజులుగా కస్టడీలో ఉన్న చంద్రబాబు నేటికీ.. న్యాయంపై ఉన్న నమ్మకంతో న్యాయపోరాటమే చేయమన్నారే కానీ.. వేరే విషయాలు ఏమీ ప్రస్తావించలేదన్నారు. ఈ క్రమంలో రేపు సాయంత్రం తెలుగు దేశం పార్టీ పిలుపునిచ్చిన కాంతితో క్రాంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని లోకేష్ కోరారు. అలానే భవిష్యత్తులో అన్నీ విషయాలపై ఐక్య కార్యాచరణతో ఇక టీడీపీ , జనసేన ముందకు పోతున్నాయి. టీడీపీ 40 ఏళ్ళ రాజకీయ అనుభవంతో జనసేన పోరాట స్పూర్తి జత కలిస్తే.. జగన్ చేస్తున్న.. చేయిస్తున్న దాడులను సమర్థవంతంగా ఎదుర్కొవచ్చన్న ఇరు పార్టీలు ఆశా భావాలు వ్యక్తమవుతున్నాయి.











