చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. బాబును అరెస్ట్ చేయించాక ఏం చేయాలో పాలుపోక సలహాల కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. బాబు అరెస్ట్ వ్యవహారం తర్వాత తొలి సారి ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్‌కు ఎదురైన బీజేపీ పెద్దలు ఫుల్ గా క్లాస్ పీకారు. జరిగిన నష్టాన్నిఎలా పూడ్చుకుంటావంటూ ప్రశ్నించడంతో జగన్ షాక్ తిన్నారు.
మొత్తంగా చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై ఢిల్లీ పెద్దల ఆగ్రహం బయటపడింది.ఈ నేపథ్యంలోనే అసలు ఏపీలో పరిస్థితి ఎలా ఉందన్న అభిప్రాయం తెలుసుకునేందుకు ఢిల్లీ బీజేపీ నేతలు ఏపీకి చెందిన పలువురు పార్టీ నేతల్ని ఢిల్లీ పిలిచారట. ఇప్పటికే జగన్ వ్యవహారంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఢిల్లీ బీజేపీ పెద్దలు త్వరలో తమ అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలుస్తోంది.
కేంద్రం డైరెక్షన్ లోనే బాబు అరెస్ట్ జరిగిందన్న అపవాదును ఎదుర్కొన్న బీజేపీ హై కమాండ్ డామేజ్ కంట్రోల్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఏపీ బీజేపీ నేతలను పిలిపించుకుని అలు విషయం తెలుసుకోవాలని ఢిల్లీ పెద్దల ప్లాన్. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఏపీలో పార్టీ పరిస్థితులపై నివేదిక కోరారట కూడా. దీంతో పాటు పురంధేశ్వరి పార్టీ పగ్గాలు చేపట్టాక అసలు ఏపీ బీజేపీలో ఎలాంటి మార్పులు వచ్చాయన్న అంశంపై కూడా ఢిల్లీ పెద్దలు ఆసక్తిగా ఉన్నారు.
వీటన్నటికంటే ముఖ్యంగా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్‌కు దగ్గరవటం కంటే దూరంగా ఉండటమే పార్టీకి ఉపయోగపడుతుందన్న అభిప్రాయంతో బీజేపీ పెద్దలున్నారు. జగన్‌ను చేరదీయటం వల్ల నష్టమా, లాభమా అన్న విశ్లేషణలు జరుగుతున్న వేళ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్… తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించటం.. ఆ తర్వాత ఏపీలో రాజకీయాలు అనూహ్యంగా మారిపోవటం కూడా బీజేపీ పరిగణనలోకి తీసుకుని లెక్కలేస్తోంది. ఏపీలో ఉన్న తాజా రాజకీయాలపై ఓ నివేదికను సిద్ధం చేసిన నేతలు అధ్యక్షురాలు పురంధేశ్వరి ముందు ప్రతిపాదనలు సిద్ధం చేశారట. చంద్రబాబు అరెస్ట్ అయ్యాక వైసీపీ నేతల్లో పెరుగుతున్న అసహనం, అసంతృప్తి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే … ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ పార్టీకి దూరంగా ఉండటమే మంచిదన్న అభిప్రాయంతో ఆ నివేదికను త్వరలో ఢిల్లీ పెద్దలకు ఇవ్వబోతున్నారు. ఈ నివేదికలను పరిశీలించాక జగన్ తో ఎలా వ్యవహరించాలి, ఎవరి మద్దతుతో వచ్చే ఎన్నికల్లో ముందుకెళ్లాలన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని ఢిల్లీ బీజేపీ నేతలు ఓ నిర్ణయానికి రావచ్చు.