మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘క్రాక్’. ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మరో నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘క్రాక్’ పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రవితేజ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. దీనికి ముందు రవితేజ నటించిన ‘డిస్కో రాజా’ నిరాశపరచడంతో ఈ సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ లోకి రావాలని రవితేజ భావిస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వాలి. కాని కరోనా కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించడంతో ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. అన్ లాక్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం సినిమా షూటింగ్లకు అనుమతి ఇచ్చింది. వెంటనే షూటింగ్ ను సెట్స్ పైకి తీసుకువెళ్ళింది చిత్ర బృందం. శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు ఫైనల్ డే షూట్ కు వచ్చేసింది. అంతేకాకుండా ఈ ఫైనల్ రోజు షూట్ ను ప్రముఖ టాలెంటెడ్ నటి వరలక్ష్మి పై కీలకమైన సీన్స్ తో కంప్లీట్ చేసి షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేసినట్టుగా ట్విటర్ ద్వారా మేకర్స్ తెలిపారు.
వరలక్ష్మి ఒక అద్భుతమైన నటి అని ఆమెతో పని చేయడం చాల ఆనందంగా ఉందని తెలిపారు. ఈ చిత్రం యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని మరోసారి దర్శకుడు గోపీచంద్ కన్ఫామ్ చేసేసారు. ‘క్రాక్’ సినిమా రవితేజ సినీ జీవితంలో ఒక మంచి సినిమాగా నిలుస్తుందని ఆయన తెలిపారు. ఈ సినిమా కోసం రవితేజ అభిమానులు కూడా ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. దర్శకుడు గోపీచంద్, హీరో రవితేజ కలయికలో వచ్చిన రెండు సినిమాలు హిట్ అయ్యాయి. ముఖ్యంగా వీరి కలయికలో వచ్చిన ‘బలుపు’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద విజయం సాధించింది. దింతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో రవితేజ హిట్ ట్రాక్ లోకి రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
Last day shoot to our #jayayamma @varusarath ..such a lovely n fantastic Actress #krack 🔥🔥👍👍 pic.twitter.com/HFxblw3SyR
— Gopichandh Malineni (@megopichand) October 28, 2020











