యాంకర్ గా, బిగ్ బాస్ 3 రన్నరప్ గా ఫేమస్ అయిన శ్రీముఖి కి సోషల్ మీడియాలో బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అప్పుడప్పుడు సినిమాల్లోనూ మెరిసే ఈ సుందరి.. ఇన్ స్టా లో హాట్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ యూత్ కు నిద్ర పట్టనీయకుండా చేయడమే కాకుండా.. వారితో అప్పడప్పుడూ చాటింగ్ కూడా చేస్తూ ఉంటుంది. తన క్రేజ్ పెంచుకొనే ప్రోసెస్ లో అమ్మడు ఈ విధానాన్ని అమలు చేస్తోందన్నమాట.
ఈ నేపథ్యంలో శ్రీముఖి.. ఈ మథ్య గోవా టూర్ కి వెళ్ళింది. అక్కడ తన ఫ్రెండ్స్ తో ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసింది. ఈ సందర్భంగా ఆమె అక్కడ దిగిన కొన్ని ఫోటోస్ ని తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా మీరు ఎలాంటి ఫోటోస్ అడిగినా పంపిస్తాను .. అడగండి అంటూ శ్రీముఖి నెటిజెన్స్ కు ఓ బంపరాఫర్ ఇచ్చింది. దాంతో వారు రెచ్చిపోయారు. ఒకొక్కరూ తమకి ఇష్టమైన ఫోటోస్ అడిగితే… ఓ నెటిజెన్ మాత్రం శ్రీముఖిని నేకెడ్ ఫోటోస్ పంపమని అడిగాడు.
దాంతో ఆమె చాలా కూల్ గా.. రామ్ గోపాల్ వర్మ తీసిన నేకెడ్ , నగ్నం అనే మూవీస్ పోస్టర్స్ అతడికి పంపింది. చాలా సమయస్ఫూర్తిగా శ్రీముఖి రియాక్ట్ అవ్వడాన్ని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. మొన్నామధ్య పూజా హెగ్డే ని ఓ నెటిజెన్ ఇలాగే అడిగితే.. ఆమె తన చిన్నతనంలోని ఫోటోస్ పోస్ట్ చేసి షాకిచ్చినట్టు.. శ్రీముఖి కూడా షాకివ్వడం హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం శ్రీముఖి క్రేజీ అంకుల్స్ అనే మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తోంది.
Must Read ;- జోరుమీదున్న బిగ్ బాస్ బ్యూటీస్