శివ మనసులో శృతి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రెజీనా. ఆ సినిమా ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోకపోయినా.. ఈ అమ్మడు మాత్రం ఆకట్టుకుంది. ఆతర్వాత సందీప్ కిషన్ తో రోటీన్ లవ్ స్టోరీ అనే సినిమాలో నటించింది.

టైటిల్ రోటీన్ లవ్ స్టోరీ అయినప్పటికీ.. కథలో వైవిధ్యం ఉండడంతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

ఆతర్వాత ఏకంగా మెగా హీరోతో నటించే ఛాన్స్ దక్కించుకుంది. అదే పిల్లా నువ్వులేని జీవితం. ఈ సినిమా సక్సస్ సాధించడంతో మరోసారి సాయిధరమ్ తేజ్ తో జతకట్టింది.
Must Read ;- లవ్ స్టోరీ బయటపెట్టిన మోనాల్.. !

అదే సుబ్రమణ్యం ఫర్ సేల్. ఈ సినిమా కూడా రెజీనాకు మంచి పేరు తీసుకువచ్చింది. ఇలా తెలుగులో వరుసగా అవకాశాలు దక్కించుకున్న రెజీనా మరో వైపు తమిళ్ సినిమాల్లో కూడా నటించింది.

ఆతర్వాత కన్నడ సినిమాల్లో కూడా నటించింది. ఇలా.. తెలుగు, తమిళ్, కన్నడ చిత్రాల్లో నటిస్తున్న రెజీనా ఇటీవల కాలంలో కెరీర్ లో కాస్త వెనబడిందని చెప్పచ్చు.

అయితే.. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసే లక్కీ ఛాన్స్ దక్కించుకుంది. ఇంతకీ.. ఏ సినిమాలో అంటారా.? ఆచార్య మూవీలో. అవును.. ఆచార్య సినిమాలో రెజీనా చిరుతో కలిసి స్పెషల్ సాంగ్ లో స్టెప్పు లేసిందని సమాచారం.
Also Read ;- ఆరబోతకు సిద్దమే అంటున్నా..టాలీవుడ్లో అవకాశాలేవీ!

ఇదిలా ఉంటే.. కెరీర్ లో కాస్త వెనకబడిన రెజీనా మళ్లీ బిజీ అవ్వాలనుకుంటుంది. అందుకనే అనుకుంట ఇటీవల ఫోటో షూట్ చేయించుకుందట. ఆ ఫోటో షూట్ లో అయితే.. రెజీనా రెచ్చిపోయిందని చెప్పచ్చు. తన అందాన్ని అంతా ప్రదర్శిస్తూ.. కుర్రకారుకు పిచ్చేక్కిచ్చేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. రెజీనా ఈ హాట్ నెస్ తో మళ్లీ అవకాశాలను దక్కించుకుని బిజీ అవుతుందేమో చూడాలి.











