అందం, అభినయం… అన్నీ ఉన్నా కొందరికి సినిమా రంగం కలిసిరాదు. ఆ కోవలోకి నటి తాప్సీ కూడా చేరుతుంది. ఆమెకు తెలుగులో మంచి అవకాశాలు చాలా వచ్చాయి కానీ హిట్లు రాలేదు. ప్రభాస్ నటించిన మిస్టర్ పెర్ ఫెక్ట్ లో మెయిన్ లీడ్ తాప్సీ కాదు కాబట్టి ఆ హిట్ లో ఆమెకు దక్కింది కొంతే. దాంతో తాప్సీ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లింది. తెలుగులో క్రేజ్ తెచ్చుకొని, హిందీలోకి వలస వెళ్లిపోవాలని నార్త్ నుంచి వచ్చిన ప్రతి హీరోయిన్ ఆశ పడుతుంటారు. మన స్టార్ హీరోయిన్స్ చాలా మంది ఇలా బాలీవుడ్ మీద మోజు పడి బొంబాయి వెళ్లి బోర్లా పడిన సందర్భాలు అనేకం.
ఐతే తెలుగులో క్రేజ్ ని బాలీవుడ్ లో ఐడెంటిటీ కార్డుగా వాడుకొని అక్కడ కూడా స్టార్ హీరోయిన్ అయిపోయింది ఢిల్లీ బ్యూటీ తాప్సి. విషయం ఏంటంటే తాప్సీకి హిందీ లో వచ్చినంత సక్సెస్ తెలుగులో రాలేదు. ఇక్కడ ఫుల్ గ్లామర్ డాల్ గా కుర్రాళ్లు హృదయాలు దోచేసిన తాప్సీని బాలీవుడ్ జనాలు మాత్రం ఓ లేడీ హీరోగా చూశారు. నామ్ షబానా, బేబీ, పింక్ వంటి బ్లాక్ బస్టర్స్ తో తాప్సీ బాలీవుడ్ స్టార్స్ జాబితాలో కలవడమే కాదు బిలియన్ క్లబ్ లో ప్లేస్ కొట్టేసింది. ఐతే ఎన్ని వచ్చినా ఆమెకు మాత్రం తెలుగు లో ఓ బ్లాక్ బస్టర్ అది సోలోగా కొట్టాలి అని కోరికట, దీనికోసం చాలా ట్రై చేసిన ఆమెకు మూడేళ్ల క్రితం ‘ఆనందో బ్రహ్మ’లో అవకాశం దొరికింది.
హారర్ కామెడీ థ్రిల్లర్ గా విడుదలైన ఈ సినిమా తెలుగులో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది అంతే కాదు తాప్సీనే ఈ సినిమాలో లీడ్ రోల్, హీరోలు ఎవరూ ఉండరు. నలుగురు కమెడియన్స్ కీలక పాత్రలు చేశారు. ఈ హిట్ వచ్చి మూడేళ్లు అవుతున్న తాప్సీకి మళ్ళీ తెలుగు ఇంతవరకు మరో హిట్ లేదు. పాపం ఈ ఢిల్లీ బ్యూటీ కూడా ‘ఆనందో బ్రహ్మ’ రేంజ్ సక్సెస్ కోసం ప్రయత్నిస్తూనే ఉంది. ఎంత ప్రయత్నించినా హీరోయిన్లు సినిమాల్లో ఉండేది తక్కువ కాలమే. దీపం ఉండగానే చక్కదిద్దుకోవాల్సిందే. కొత్త నీరు వచ్చినప్పుడు తాప్సీలాంటి పాత నీటిని నమ్ముకుని ఎవరు మాత్రం రిస్క్ చేయగలరు.











