మాజీ అటార్నీ జనరల్ సోలి సోరాబ్జీ కరోనాతో చనిపోయారు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతు శుక్రవారం తుదిశ్వాస విడిచారు. భారతదేశపు అత్యుత్తమ న్యాయవాదులలో ఆయన ఒకరు. పద్మ విభూషణ్ గ్రహీత కూడా. ఈయన 1930లో ముంబైలో జన్మించారు. 1953లో బొంబాయి హైకోర్టులో తన న్యాయ ప్రాక్టీసును ప్రారంభించారు. 1971 లో, ఆయనను సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా నియమించింది. సోరబ్జీ మొదట 1989లో అటార్నీ జనరల్ అయ్యారు.. ఆ తరువాత 1998 నుండి 2004 వరకు మరో దఫా పనిచేశారు. దేశంలోని ప్రముఖులు, రాజకీయనాయకులు, మేధావులు సంతాపం ప్రకటించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ‘సోలీ సోరాబ్జీ భారత న్యాయ వ్యవస్థకు ప్రతీక’ అని భారత రాష్ర్టపతి రామ్ నాథ్ అన్నారు.
Must Read ;- కృష్ణా జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ రామ్‌ప్రసాద్ కరోనాతో మృతి











