తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా దగ్గుబాటి రానాకు మంచి ఫాలోయింగ్ ఉంది. ‘బాహుబలి’ సినిమా వల్లనే రానాకి అంతటి క్రేజని వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆయన మరో పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తెలుగులో ‘అరణ్య’ పేరుతో విడుదలవుతున్న బహు భాషా చిత్రం ‘హాథీ మేరే సాథీ’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.తమిళంలో ‘కాడన్’ గా వస్తోంది. ఈ సినిమాను ప్రభు సాల్మన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈరోస్ ఇంటర్నేషనల్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు , హిందీ, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 2021 సంక్రాంతికి విడుదలకానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించింది. ఈరోజు రిలీజ్ చేసిన ఒక సరికొత్త పోస్టర్, మోషన్ వీడియో ద్వారా ఈవిషయాన్ని ప్రకటించింది. ఈ పోస్టర్ లో ఒక వైపు విరిగిన గోడ, రానా, విష్ణు విశాల్ కనిపిస్తుండగా మరోవైపు ఏనుగులు కనిపిస్తున్నాయి. వృక్షాలు, అడవులను సంరక్షించమనే మెసేజ్ ను ఈ పోస్టర్ ద్వారా ఇస్తున్నారు.
ఈ సినిమా 2020 ఏప్రిల్ నెలలోనే రిలీజ్ అవ్వాలి. కాని కరోనా కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించారు. సినిమా థియాటర్స్ లేక ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. అనేక ఓటీటీ సంస్థల నుండి మంచి ఆఫర్స్ వచ్చినా దర్శకనిర్మాతలు పెద్దగా ఇంట్రస్ట్ చూపించలేదు. ప్రస్తుతం దేశంలో అన్ లాక్ ప్రక్రియ నడుస్తోంది. ఈమధ్యనే సినిమా హాళ్లు ఓపెన్ చేసుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెంటనే నిర్మాతలు ‘అరణ్య’ సినిమా థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి పనులు మొదలుపెట్టారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో రానా పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. గుబురు గడ్డంతో ఉన్న రానాకి, అడవులకు ఏంటి సంబంధం అన్నదే సినిమా థీమ్. మరి ఈ సినిమాతో రానా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తారో చూడాలి .
Thank you @karanjohar for the love! 🙌❤️@RanaDaggubati @PulkitSamrat @ShriyaP @zyhssn @ErosSTX @ErosMotionPics #PrabuSolomon #HaathiMereSaathi https://t.co/28a7xcuXAK
— Eros Innovation (@ErosInnovation) October 21, 2020











