ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ .. దేశాన్ని అతలాకుతలం చేసేస్తోంది. ఆల్రెడీ చాలా స్టేట్స్ సెల్ఫ్ లాక్ డౌన్స్ విధించి.. ప్రజల్ని అవసరముంటేనే కానీ బైటికి రావద్దని సూచిస్తున్నారు. అలాంటి ఈ పరిస్థితుల్లో కోవిడ్ 19 వల్ల ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని సినిమా షూటింగులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ ను జూలై వరకూ ఆపేయమని దర్శక నిర్మాతలకు తెలిపినట్టు వార్తలొస్తున్నాయి.
ఇటీవల పవన్ కళ్యాణ్ కు కరోనా పాటిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఆయన నటిస్తున్న క్రిష్ ‘హరి హర వీరమల్లు’, సాగర్ కె చంద్ర ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మలయాళ రీమేక్ మూవీస్ .. షూటింగ్స్ జూలై వరకూ ఆగిపోనున్నాయి. దీని వల్ల సినిమాల విడుదలలో కూడా చాలా మార్పులొస్తాయి. దీంతో పాటు హరీశ్ శంకర్ సినిమా కూడా చాలా లేట్ గా సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలున్నాయి. ఇటీవల వకీల్ సాబ్ తో బిగ్ హిట్ కొట్టిన పవర్ స్టార్ తదుపరి సినిమా ఎప్పుడు విడుదలవుతుందో చూడాలి.
Must Read ;- కరోనా తగ్గినా.. సినిమాల షూటింగ్స్ కు బ్రేక్!











