కరోనా బారిన పడి మరో ఉన్నతాధికారి మృత్యువాతపడ్డారు. కృష్ణా జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న రాంప్రసాద్ కరోనాతో పోరాడి ఇవాళ ప్రాణాలు వదిలారు. గత పది రోజులుగా ఆయన విజయవాడలోని సన్ రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం చనిపోయారు. నాన్ కేడర్ ఎస్పీగా ఉన్న రాంప్రసాద్ ప్రస్తుతం విజయవాడ ఇంటెలిజెన్స్ ఎస్పీగా చేస్తున్నారు. మంచి అధికారిగా రాం ప్రసాద్ గుర్తింపు పొందారు.
సచివాలయంలో కరోనా కలకలం
ఏపీలోని వెలగపూడి సచివాలయంలో దాదాపు వంద మంది ఉద్యోగులు కరోనా బారినపడ్డారు. ఇప్పటికే ఆరుగురు ఉద్యోగులు కరోనాతో ప్రాణాలు కోల్పోయారని ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు మీడియాకు తెలిపారు. ఇక విజయవాడ దుర్గగుడిలో 60 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. వారిలో నలుగురు మృతి చెందారు. కరోనాతో ప్రభుత్వ ఉద్యోగులు పదుల సంఖ్యలో చనిపోతూ ఉండటంతో, వర్క్ ఫ్రం హోం అనుమతించాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
Must Read ;- కరోనాను జయించిన తెలంగాణ సీఎం!