కరోనా బాధితులకు రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం భారీ విరాళం ప్రకటించింది. రాజస్థాన్ రాయల్స్ ఫౌండేషన్ పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ ఇప్పుడు రూ.7.5 కోట్లు విరాళంగా ప్రకటించింది.
కలవరపెడుతున్న కరోనా
కరోనా కలవర పెడుతోంది. యావత్ భారత్‌ను వణికిస్తోంది.ఆర్థికంగా అందరినీ కుదిపేస్తోంది.ఇటువంటి తరుణంలో ఆపన్నహస్తం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో క్రికెట్ ప్రపంచం సైతం తనవంతుగా సాయం చేసేందుకు ముందుకొస్తోంది. ఇటీవలే కోల్‌కతా నైట్ రైడర్స్ పేసర్ కమిన్స్, ఆ తర్వాత ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ బ్రెట్ లీ ఇటీవలే తమవంతు సాయం అందించారు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ సైతం తన ఔన్నత్యం చాటుకుంది. కరోనా బాధితుల కోసం రూ.7.5 కోట్లు విరాళంగా ప్రకటించింది.
ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది..
నిధుల సేకరణలో రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యంతో పాటు జట్టు ఆటగాళ్లు కూడా తమవంతు తోడ్పాడు అందించారు. రాజస్థాన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. ఎందుకంటే అక్కడి నుంచే రంజిత్ బర్తాకుర్ అధ్యక్షతను ఆర్‌ఆర్‌ఎఫ్(రాజస్థాన్ రాయల్స్ ఫౌండేషన్) ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తోంది. కరోనాతో దేశ ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది. బాధితులకు ఆక్సిజన్ అందించేందుకు ఆస్పత్రులు ఎంతో కష్టపడుతున్నాయి. అందుకు మా వంతు బాధ్యతగా ఈ విరాళం ప్రకటించాం.. అని రాజస్థాన్ యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది.
Must Read ;-సచిన్ ఔదార్యం.. కొవిడ్ బాధితులకు విరాళం











