తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో 20 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. మరో 200 మందికి పైగా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నారు. మరో అర గంటకు మాత్రమే సరిపోయే ఆక్సిజన్ నిల్వులున్నాయని ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్న నేపథ్యంలో కొవిడ్ రోగుల బంధువుల అర్తనాదాలు మిన్నంటాయి. అయితే శుక్రవారం సాయంత్రం 5 గంటల కల్లా ఆస్పత్రికి ఆక్సిజన్ సరఫరా అందాల్సి ఉంది. సకాలంలో ఆక్సిజన్ నిల్వలు ఆస్పత్రికి చేరకపోవడం, రోగులకు అందే ఆక్సిజన్ శాతం తగ్గడం కారణంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది రోగులకు ప్రాణాప్రాయం ఉందని ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా 22 మంది కరోనా రోగులు మరువకముందే, ఈ ఘటన చోటుచేసుకోవడంతో ప్రతిఒక్కరినీ కలిచివేసింది.
Must Read ;- ప్రాణవాయువు లేక ఊపిరి పోతోంది.. ఆక్సిజన్ అందక ఆసుపత్రిలో 25 మంది మృతి