18 నుంచి 45 ఏళ్ల లోపు ఉన్నవారికి ఉచిత వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు 30 లక్షల మందికి వ్యాక్సిన్ అందించిన సర్కార్.. ఇక రాష్ట్రంలో ఉన్న మొత్తం నాలుగు కోట్ల మందికి వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వనున్నట్టు తెలిపింది. దీని వల్ల ప్రభుత్వం మీద 2500 కోట్ల రూపాయల భారం పడనుంది. ఇప్పటివరకు 30 లక్షల మందికి వ్యాక్సిన్ అందించింది. ఫ్రీ టీకా అందించేందుకు కేసీఆర్ రెండు రోజుల్లో ఉన్నతాధికారులతో సమీక్ష జరుపనున్నారు. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
Must Read:కేంద్రానికో ధర.. రాష్ట్రాలకో ధరనా?: వ్యాక్సిన్ ధరలపై కేటీఆర్ ట్వీట్











