కరోనాకు మరో జర్నలిస్టు బలయ్యారు.నాలుగు దశాబ్దాలుగా లక్షలాది పాఠకుల మన్ననలు పొందిన స్వాతి వార పత్రిక అసోసియేట్ ఎడిటర్ మణిచందన(46) కరోనాతో కన్ను మూశారు. మణిచందన స్వయానా స్వాతి పబ్లిషర్, ఎడిటర్ వేమూరి బలరాం కుమార్తె.స్వాతి వార పత్రిక నిర్వహణలో ఆమె రెండు దశాబ్దాలుగా కీలకపాత్ర పోషిస్తున్నారు.ఏడాది నుంచి మణిచందన క్యాన్సర్‌తో పోరాడుతున్నారు.దీనికితోడు వారం క్రితం కరోనా పాజిటివ్ నిర్థరణ అయింది. ఆసుపత్రిలో చికిత్స పొందతూ ఆమె తుది శ్వాస విడిచారు.మణిచందన భర్త అనిల్ కుమార్ ఆదాయపు పన్నుశాఖ ప్రిన్సిపల్ కమిషనర్‌గా పని చేస్తున్నారు.వారికి ఇద్దరు సంతానం.స్వాతి అసోసియేట్ ఎడిటర్ మణిచందన కరోనా బారిన పడి చనిపోవడంతో పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్ సవారీ..
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...











