బాల నటుడు తేజా సజ్జాని హీరోగా ప్రమోట్ చేస్తూ ప్రశాంత్ వర్మ తెరెకెక్కించిన జాంబీ హారర్ థ్రిల్లర్ ‘జాంబిరెడ్డి’. రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని .. జాంబీ జానర్ లో కి చొప్పించి మరీ భయపెట్టి నవ్వించిన ఈ సినిమా థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అదే విధంగా టీవీల్లోనూ మంచి టీఆర్పీ సంపాదించింది. అందుకే ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నాడట దర్శకుడు ప్రశాంత్ వర్మ.
నిజానికి జాంబిరెడ్డి ప్రమోషన్స్ లో ‘జాంబిరెడ్డి’కి సీక్వెల్ కూడా ఉంటుందని ప్రశాంత్ వర్మ చెప్పాడు. అయితే ఇంకా సినిమా రిలీజ్ అవకుండా.. సీక్వెల్ గురించి మాట్లాడడంతో అప్పట్లో అందరూ లైట్ తీసుకున్నారు. అయితే సినిమా హిట్టవడంతో .. ఇప్పుడు ఆ మాటల్ని ప్రశాంత్ నిజం చేస్తున్నాడని అనుకోవాలి.
రీసెంట్ గా జాంబిరెడ్డి సీక్వెల్ గురించి హీరో తేజా సజ్జాతో దర్శకుడు ప్రశాంత్ డిస్కస్ చేశాడట. మొదటి భాగం .. కోవిడ్ 19 ఫస్ట్ వేవ్ గురించి రూపొందితే.. రెండో భాగం.. కోవిడ్ సెకండ్ వేవ్ మీద ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం సీక్వెల్ కు స్ర్కిప్ట్ రాసే పనిలో పడ్డాడట ప్రశాంత్ వర్మ. వీలైనంత త్వరగా స్ర్కిప్ట్ కంప్లీట్ చేసి.. ‘జాంబిరెడ్డి 2’ ను పట్టాలెక్కించబోతున్నాడట. మరి రెండో భాగం మొదటి భాగం స్థాయిలో సక్సెస్ అవుతుందేమో చూడాలి.