దేశంలో ఒకవైపు కరోనా కేసులు పెరుగుతుంటే, మరోవైపు నేతలు వింత వింత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆపదకాలంలో అండగా ఉండాల్సిన నేతలే.. అసహ్యించుకునేలా మాట్లాడుతుండటం చర్చనీయాంశమవుతోంది. తాజాగా మాజీ ముఖ్యమంత్రి తివేంద్రసింగ్ రావత్ కరోనా వైరస్ పై వింత వ్యాఖ్యలు చేయడంతో వైరల్ గా మారాయి. ‘‘కరోనా వైరస్ కూడా మనుషుల్లాంటి జీవేనని, మనలాగే వైరస్ కూడా జీవించే హక్కు ఉంది. మనుగడ కోసమే వైరస్ రూపు మార్చుకుంటుందని కామెంట్స్ చేశారు. ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు మాజీ సీఎంపై రెచ్చిపోతున్నారు. కరోనా వేళ.. ఈ వింత వ్యాఖ్యలు.. ఏంటి ? అని ఆయనపై మండిపడుతున్నారు. ఇప్పటికే దేశంలో మోడీ ప్రభావం తగ్గుతుండటం. నాయకులు వింత వింత వ్యాఖ్యలు చేస్తుండటంతో బీజేపీకి ప్రతికూల భావనలు నడుస్తున్నాయి.
బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!
rహెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...










