వైసీపీ ఎంపీ రఘురామరాజు గత కొన్నిరోజులుగా అధికార పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఎక్కువగా సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తుండటంతో, ఆయనపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు సీరియఎస్ అవుతున్నారు. ప్రతిరోజూ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఏపీ సీఐడీ అధికారులు శుక్రవారం హైదరాబాద్ లోని రఘురామరాజు ఇంటికి చేరుకున్నారు. అయితే ఈ ప్రయత్నాన్ని సీఆర్ పీఎఫ్ పోలీసులు అడ్డుకున్నారు. కనీసం 30 మంది అధికారులు వచ్చి రఘురామరాజును అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇంటి వద్ద గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. రఘురామరాజుపై నాన్ బెయిల్ బుల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ముందస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ రఘురామ రాజు కుటంబ సభ్యులు సీఐడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పుట్టినరోజు నాడే అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.