పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం గబ్బర్ సింగ్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో మళ్లీ ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని పవన్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఇన్నాళ్లుకు ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ మూవీ అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది కానీ.. ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లలేదు. హరీష్ శంకర్ మాత్రం స్క్రి రెడీ చేసి పవన్ ఎప్పుడు అంటే అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారని సమాచారం.
అయితే.. ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టికి హరీష్ శంకర్ అవకాశం ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆమె పాత్ర ఏమిటో చూద్దాం. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉందట. అది పవన్ కళ్యాణ్ అన్నయ్య కుమార్తె పాత్ర అట. ఆ పాత్ర కోసమే కృతిశెట్టిని తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రచారంలో ఉన్న ఈ వార్త వాస్తవమేనా కాదా అనేది తెలియాల్సి ఉంది. ఇక.. పవన్ సరసన నటించే హీరోయిన్ ఎవరు అనేది ఇంకా ఖరారు కాలేదని తెలిసింది. ఇక ఈ మూవీ షూటింగ్ ను ఆగస్టు నుండి ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ ఇటీవలే ఈ సినిమా కోసం స్పెషల్ గా ఫోటో షూట్ లో పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. ఇందులో పవర్ స్టార్ సరికొత్త లుక్ లో కనిపిస్తారని.. ప్లాష్ బ్యాక్ లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని అంటున్నారు. గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందించిన హరీష్ శంకర్.. ఈసారి కూడా పవర్ స్టార్ తో మరో బ్లాక్ బస్టర్ అందించడం ఖాయం అనే పాజిటివ్ టాక్ ఉంది. మరి.. హరీష్ శంకర్ నమ్మకాన్ని ఎంత వరకు నిలబెట్టుకుంటారో చూడాలి.











