September 15, 2026 1:27 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

నా సినిమా వస్తే హిట్టేనని అందరికీ తెలుసు – నిర్మాత ఎడిటర్ మోహన్

సినిమా రంగంలోకి ఎడిటర్ గా ప్రవేశించి నిర్మాత గా ఎదిగి ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశారాయన. ఆయన సినిమా విడుదలవుతుందంటే ఇతర నిర్మాతలకు భయమే. హిట్ కి కేరాఫ్ అడ్రస్ ఆయనే.

September 19, 2020 at 2:34 PM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఎడిటర్ మోహన్ అనగానే అది ఆయన వృత్తి అనుకునేవారు చాలామందే ఉంటారు. ఒకప్పుడు వృత్తేగాని తదనంతర కాలంలో ఆయన పెద్ద నిర్మాత. ఆయన సినిమా విడుదలవుతుందంటే ఇతర నిర్మాతలు తమ సినిమాల విడుదలను వాయిదా వేసుకునేవారు. జీవితంలోనే కాదు సినిమాల్లోనూ ‘జయం’ ఆయనను వెన్నంటే ఉంటుంది. ఏది చెబితే ప్రేక్షకుడు స్పందిస్తాడో, ఎలా చెబితే ధియేటర్ లో ప్రేక్షకుడు ఊగిపోతాడో ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు అనడంలో అతిశయోక్తి లేదు. దీన్ని బట్టి చూస్తుంటే సినిమా మీద ఆయనకున్న కసి, కృషి ఏపాటిదో అర్థమవుతుంది. ఆయన పుత్రల్లో ఒకరు మోహన్ రాజాగా దర్శకుడిగా ఎదిగితే, ఇంకొకరు ‘జయం’ రవిగా తమిళంలో హీరోగా విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ‘ఓ ఎడిటర్ కు ఇంత పేరా’ అంటే ఆయన సినిమాను కాచి వడపోశారు కాబట్టే అది సాధ్యమైంది. 80 ఏళ్ల జీవితకాలంలో 65 ఏళ్ల సినిమా పయనాన్ని పూర్తిచేసుకున్నఈ సినిమా దిగ్గజంతో ‘ది లియో న్యూస్’ జరిపిన ఇంటర్వ్యూ విశేషాలివి.

ఎడిటర్ మోహన్ గారూ ఎలా ఉన్నారు?

చాలా బాగున్నానండీ.. చాలా రోజుల తర్వాత మనం ఇలా జూమ్ లో కలుసుకోగలిగాం. తెలుగు వాళ్లతో టచ్ లో లేకుండా పోయానన్న బాధ ఉంది. కాకపోతే నా సినిమా వాళ్లంతా నాకు టచ్ లోనే ఉన్నారు.

65 ఏళ్లు సినిమాలకే అంకితమయ్యారు.. మీకు ఏమినిపిస్తోంది?

చాలా సంతృప్తిగా ఉందండీ. నాలుగు తరాల నటులతో పనిచేశాను. సినిమా తప్ప నాకు ఇంకోటి తెలియదు. పెద్దగా చదువుకోక పోయినా సినిమాలు చూస్తూనే అంతా నేర్చుకున్నానండీ. ఎక్కువగా ఇంగ్లీషు సినిమాలు చూసేవాడిని. మనం ఎందుకు వెనుకబడిపోతున్నాం అనిపించేది. మంచి సినిమాలు తీయాలన్న ఆకాంక్షతోనే పనిచేసేవాడిని. ఆ అనుభవంతోనే విజయవంతమైన సినిమాలు నిర్మించాను. నేను తీసిన ప్రతి సినిమా వంద రోజులు ఆడింది. ఆ సంతృప్తి చాలు నాకు. ఇప్పుడు పిల్లలకు మార్గదర్శిగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నాను.

ఎడిటర్ మోహన్ ఇంటర్వ్యూలో మరిన్ని విశేషాల కోసం యూట్యూబ్ లోని మా వీడియో చూడండి

 మీ సొంతూరు ఏది? సినిమా రంగానికి ఎలా వచ్చారు?

అందరూ నేను తెలుగువాడిని అనుకుంటారు. తెలుగువాళ్లే కాదు తమిళియన్లు కూడా నేను తెలుగువాడినే అనుకుంటున్నారు. కాకపోతే తెలుగుతోనే నాకు అనుబంధం ఎక్కువ. తెలుగులో రేలంగి మాదిరిగా తమిళంలో ఓ పెద్ద హాస్యనటుడు తంగవేలు అని ఉండేవారు. ఆయనకు పిల్లలు లేరు. ఆయన నన్ను తన కొడుకులా పెంచారు. సినిమారంగంతో సంబంధం ఏర్పడటానికి ఆయనే కారణం. తంగవేలుగారితో స్టూడియోలకు తరచూ స్టూడియోలకు వస్తుండేవాడిని.1958 నుంచి తెలుగువారితో నాకు అనుబంధం ఉంది. తమిళనాడులో మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్ తెలుసుకదా… ఆ సమీపంలోనే ఉన్న ఊరు తిరుమంగళం మా ఊరు. చెన్నైలోని నెప్ట్యూన్ స్టూడియోలో ఎడిటింగ్ విభాగంలో 1960లో చేరాను.

ఎడిటర్ గా నేను మొదటిసారిగా పనిచేసిన సినిమా ఎంజీఆర్ నటించిన ‘అరసిలన్ కుమరి’. దీంతోపాటు తాతినేని ప్రకాశరావు ‘ఎల్లోరం ఇన్నట్టు మన్నార్’కు పనిచేశాను. ఎడిటర్ గా పేరు పడింది మాత్రం ‘గురువును మించిన శిష్యుడు’ అనే తెలుగు సినిమా. బి. విఠలాచార్య దీని దర్శకుడు. ఆయనే నాకు గురువు. నన్ను మాత్రం అందరూ గురువును మించిన శిష్యుడు అనే అంటారు. అక్కడి నుంచే నాకు తెలుగుతో అనుబంధం ఏర్పడింది. ఈ సినిమాతోనే ఎడిటర్ గా నా పేరు పడింది. ‘నవగ్రహ పూజామహిమ’, ‘అగ్గిపిడుగు’, ‘కదలడు వదలడు’, ‘చిక్కడు దొరకడు’… ఇలా ఎన్నో సినిమాలకు ఆయన దగ్గర చేశాను. ఎన్టీఆర్ సినిమాలు చాలా వాటికి నేను పనిచేశాను. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ… ఇలా దాదాపు అనేక భాషల సినిమాలు ఉంటాయి. ఎడిటర్ గా 200 సినిమాలకు పనిచేసి ఉంటాను.

నిర్మాతగా ఎందుకు మారాల్సి వచ్చింది?

సినిమా మీద అవగాహన పెరిగింది… నమ్మకం కుదిరింది. ఎడిటర్ గా ఉంటూనే నేను స్క్రిప్టు లో కూర్చున్న సినిమా ‘మనవూరి మారుతి’. అంతకుముందు ‘లాస్ట్ ఆఫ్ ది వరల్డ్’ అని ఇంగ్లీషులో ఓ సినిమా వచ్చింది. డాక్యుమెంటరీ తరహాలో నాలుగు గంటల నిడివి ఉన్న సినిమా ఇది. నిర్మాతగా మారి దీన్ని తెలుగులో ‘జంతు ప్రపంచం’గా అందించాను. పెంగ్విన్ ను మొదటిసారిగా తెరపై చూపించిన సినిమా ఇది. అది మనిషి లాగానే బిహేవ్ చేస్తూ ఉంటుంది. ‘మనవూరి మారుతి’ని తమిళంలో డబ్ చేస్తే బాగుంటుందని అనిపించి నిర్మాతగా మారి తమిళంలో విడుదల చేశా.

ఈ సినిమా పెద్ద హిట్. ఆ తర్వాత మరొకొన్ని తెలుగు సినిమాలను కూడా తమిళంలో డబ్ చేశాను. ఆ తర్వాత ‘శ్రావణ శుక్రవారం’, ‘కంకణం’ అనువాద సినిమాలతో తెలుగులో కూడా నిర్మాతగా మారాను. నిర్మాతగా చేసిన డబ్బింగ్ సినిమాలు 60 వరకూ ఉంటాయి. నా ఎం.ఎం. మూవీ ఆర్ట్స్ బ్యానర్ పైనే చేసిన స్ట్రెయిట్ సినిమాలు తెలుగులో 10, తమిళంలో 5 ఉంటాయి. ఏ బిజినెస్ చేసినా అది దెబ్బతినకూడదు… లాభం రావాలనే మనస్తత్వం నాది. చిరంజీవి గారిని డబ్బింగ్ సినిమా ద్వారా తమిళంలో పరిచయం చేసింది నేనే. ఆయన నటించిన ‘ఆరని మంటలు’ సినిమాని తమిళంలోకి డబ్ చేశాను. సినిమాల విషయంలో నా జడ్జిమెంట్ ఎప్పుడూ తప్పలేదు.

సినిమా మేకింగ్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?

స్క్రిప్టు విషయంలో పూర్తిగా ఇన్వాల్వ్ అవుతాను. ఒక పాత్ర నచ్చితే ఎవరైతే సరిపోతారో జడ్జి చేస్తాను. 1990లో తమిళంలో ‘నాన్ పుడిచ్చ మాప్పిల్లై’అనే ఓ సినిమా వచ్చింది. అందులో మామగారి పాత్ర నాకు చాలా బాగా నచ్చింది. ఈ సబ్జెక్టు, ఈ పాత్ర తెలుగుకు చాలా బాగుంటాయి అనిపించింది. ఎప్పుడూ ఇలాంటి పాత్రలు వేసేవారు ఈ పాత్ర వేయకూడదని నిర్ణయించుకున్నాను. ఎవరైతే బాగుంటుందా అని ఆలోచిస్తే దాసరి నారాయణరావు అయితేనే ఈ పాత్ర న్యాయం చేకూరుతుందని అనుకున్నాను. ఆయన అప్పటికే అనేక హిట్ చిత్రాల దర్శకుడు. నా రూట్ వేరు ఆయన రూట్ వేరు… అందుకే సబ్జెక్టును ఆయన చేతికి ఇచ్చేయకూడదని అనుకున్నా. ముత్యాల సుబ్బయ్యను దర్శకుడిగా ఎంచుకున్నా. అప్పటిదాకా మామగారంటే అల్లుళ్లకు గౌరవం లేదు.

ఈ సినిమా విడుదలయ్యాక పెద్ద హిట్ అవడమే కాదు మామగారి గౌరవాన్ని ఎంతో పెంచింది. ‘నా జీవితానికి తోడుగా ఒక మనిషిని ఇచ్చినవాడు’ అని మామగారి గురించి అల్లుడు అనుకునేలా ఈ సినిమా చేసింది. ‘బావ బావమరిది’ సినిమా విషయంలో కూడా అంతే. ఆ సినిమా తమిళంలో ఏవరేజ్ గానే ఆడింది. ఓ యువతి ఓ గొప్పమనిషిని పెళ్లాడుతుంది. తన తమ్ముడిని స్ర్తీధనంగా తీసుకువెళ్లిందనే పాయింట్ నాకు బాగా నచ్చింది. దాన్ని ‘బావ బావమరిది’గా తెలుగులో నిర్మించాను. మా అబ్బాయి రవి ఇందులో జయసుధ తమ్ముడిగా చేశాడు. 175 రోజులు ఆడిన సినిమా అది. అందులోని ‘బావలు సయ్యా’ పాటను మించిన పాట ఇంతవరకు రాలేదని చెప్పగలను. అంతగా పాపులర్ అయింది ఆ పాట. ‘హిట్లర్’ పాత్ర చిరంజీవి అయితే పండుతుందని నమ్మాను. నా నమ్మకం వమ్ము కాలేదు. అందులో చిరంజీవి తండ్రిగా దాసరి నటించారు. ఇద్దరి మద్యా ఓ సెంటిమెంట్ సీన్ ఉంది. ‘రేయ్ నేను చచ్చేటప్పుడే నువ్వొస్తానంటే నేనెప్పుడో చచ్చేవాడిని కదరా’అనే దాసరి డైలాగ్ ఎంతగా పండిందో చెప్పాల్సిన పనిలేదు.

ఎడిటర్లు చాలామంది డైరెక్టర్లుగా సక్సెస్ అయ్యారు కదా… మీరెందుకు దర్శకుడిగా మారలేదు?

ప్రొడక్షన్ మీదే దృష్టి పెట్టడం వల్ల డైరెక్షన్ చేద్దామని అనుకోలేదు. నేను చెప్పింది చెప్పినట్టు చేసే దర్శకుడినే పెట్టుకుంటా. స్ర్కిప్టు, ఎడిటింగ్ సినిమాకి ప్రాణం. ఈ రెండిటినీ నా చేతిలో పెట్టుకుంటాను. రష్ రాగానే చూసి మంచిచెడ్డలు బేరీజు వేసుకుంటాను. పంపిణీదారులందరికీ నా మీద నమ్మకం ఎక్కువ. ఆ నమ్మకాన్ని వమ్ముచేయకూడదనే ఉద్దేశంతోనే దర్శకత్వం వైపు చూడలేదు. నేను చేసిన సినిమాల వల్ల నా డిస్ర్టిబ్యూటర్లు ఎవరూ 10 పైసలు కూడా నష్టపోలేదు. అందరూ లాభపడ్డవారే. లాభాల్లో అప్ అండ్ డౌన్స్ తప్ప ఎవరూ నష్టపోలేదు. నేను పడిన కష్టానికి నాకు దేవుడిచ్చిన ఫలితం అది.

మీ పిల్లలు ఇద్దరూ సినిమా రంగంలో బాగా సెటిలయ్యారు. వారు తెలుగులోకి రారా?

ఎందుకు రారు వస్తారు. మళ్లీ మా పెద్దబ్బాయి తెలుగులో సినిమా చేయబోతున్నాడు. మా అబ్బాయిలిద్దరూ తెలుగు బాగా మాట్లాడతారు. నేను పెళ్లి చేసుకున్నది తెలుగమ్మాయిని. నా జీవితంలో ఎక్కువభాగం ఆక్రమించింది కూడా తెలుగే.

సినిమా విజయంలో ఎడిటర్ పాత్ర ఎంత ఉంటుంది? మీరు సీనియర్ ఎడిటర్ కాబట్టి అడుగుతున్నాను?

స్క్రిప్టు అనేది ఓన్లీ ఇమేజినేషన్. అది ఊహరూపంలోనే ఉంటుంది. ఎడిటింగ్ అనేది ఇమేజినేషన్ కాదు… వచ్చిన ప్రొడక్ట్ ను జనానికి ఎలా అందివ్వాలని అనుకునేది. నా సినిమా ఇలా ఉంది చూడండి అని దర్శకుడు అనే వాడు చెప్పుకోవచ్చు…. ఇలాగే కెమెరా మేన్ కెమెరా కోణంలో చెప్పుకోవచ్చు, సంగీత దర్శకుడు తన కోణంలో చెప్పుకోవచ్చు.. ఎన్నో విభాగాలవారు చెప్పుకునే అవకాశం ఉంది. అలా చెప్పుకోలేని వాడు ఎడిటర్ ఒక్కడే. సినిమాకు సంబంధించిన ప్రతిభాగంలోనూ ఎడిటర్ అనేవాడు ఉంటాడు. ఎమోషన్ ని ఎలా చూపిస్తున్నామనేది ఎడిటర్ ప్రతిభ మీదే ఆధారపడి ఉంటుంది.

ఆదుర్తి సుబ్బారావు, మధుసూదనరావు, కె.ఎస్.ఆర్. దాస్… వీరంతా కూడా ఎడిటింగ్ నుంచి వచ్చి దర్శకులుగా ఎదిగినవారే. ఎడిటర్ అనేవాడు సినిమాలో ఎమోషన్ ను తీసుకురావాలి. ఇప్పుడు గ్రాఫిక్ చేసేవారు ఉన్నారుగానీ ఎడిటింగ్ చేసేవారు లేరు. జీవం ఉంటేనే కదా సినిమా రక్తికట్టేది. ఎడిటింగ్ సరిగా లేకపోతే ఎమోషన్ కేరీ అవదు. అది ఎడిటింగ్ టేబుల్ కాదు డిసిషన్ మేకింగ్ టేబుల్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సినిమాలో అందరూ చేసే తప్పుల్ని సరిచేసేవాడు ఎడిటర్ ఒక్కడే. నేటి సినిమాల్లో ఆ ఎమోషన్ లోపిస్తోంది… అందుకే ఫ్లాప్ లు ఎదురవుతున్నాయి. మా రోజుల్లో ఎపెక్ట్స కూడా మేమే చేసేవాళ్లం.

మీరు పనిచేసినప్పటి రోజులకూ ఇప్పటికీ టెక్నికల్ గా చాలా మార్పులు వచ్చాయి. ఎడిటింగ్ కు ఇప్పుడున్న టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగపడుతోంది?

ఒక డిసాల్వ్, ఒక వైప్ అనేవి చేయడానికి మా రోజుల్లో 10 రోజులు పట్టేది. ఇప్పుడు టచ్ చేస్తే వచ్చేస్తుంది. వండర్స్ ఎక్కువయ్యాయిగాని తాము చేసినదాన్ని చూసి అంచనా వేసుకోవడం తగ్గిపోయింది. తాము చేసిందే కరెక్ట్ అనే భావనలో ఉన్నారు. ఇప్పుడు సక్సెస్ చేసుకోడానికి మార్గాలు కూడా పెరిగాయిగాని వాటిని ఎవరూ సరిగా వినియోగించుకోవడం లేదు.

చాలామంది మీ కథలను కాపీ కొట్టినా మీరెందుకు యాక్షన్ తీసుకోలేదు?

ఆ సంగతి ముందు మనకు తెలియదు కదా. సినిమా విడుదలయ్యాక తెలుస్తుంది. పైగా అందరూ తెలిసిన వాళ్లే. అందుకే పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. కానీ బాధేసేది. నాకన్నా ముందే వాళ్లే రిలీజ్ చేసేసేవారు. నేను సెకండరీ అయిపోతున్నా.

మీరింత సీనియర్ పర్సన్ అయి ఉండి మీరు ఫైట్ చేయలేకపోవడం ఏమిటి?

రిలీజైన తర్వాత నేను పట్టించుకుంటే వారి లైఫ్ పాడైపోతుంది. అతను డైరెక్టర్ అయినా, వేరే టెక్నిషియన్ అయినా వారి మీద నింద పడుతుంది. అది నాకు ఇష్టం లేదు. పైకొచ్చేవాడిని మనం ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఇలాగే ఓ తమిళ సినిమా చూసి తెలుగులో చేద్దామనుకున్నా. నేను వచ్చేలోపల ఇక్కడ దాన్ని ప్రారంభించేశారు. నేను కోట్లు ఖర్చుపెట్టి తీశాక ఆల్రెడీ రిలీజైన సినిమానే వచ్చిందనుకోండి… అప్పుడేం చేయాలి. రీమేక్ సినిమాలు చేయడంలో ఉండే కష్టాలు బయటికి చెప్పలేం. అక్కడ ఉన్న ఒక సినిమా బాగుంటే అందులో సీన్లకు సీన్లనే లేపేస్తున్నారు.

తెలుగులో మళ్లీ సినిమాలు ఏమైనా చేయాలనుకుంటున్నారా?

తెలుగు కోసం 20 సబ్జెక్టులు రెడీ చేసి పెట్టాను. వాటిని కాపీకొట్టి సినిమాలు కూడా రిలీజ్ చేసేశారు. ఇది నేను చెబితే బాగుండదు.నేను డబ్బిచ్చి కొన్న సినిమాని దాని రూపం మార్చి విడుదల చేసేశారు. ఆ సినిమా పెద్ద హిట్టయ్యింది. ఇలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి.

మీ కుటుంబం వివరాల గురించి చెప్పండి?

హీరోగా మా రవికి మంచి విజయాలు ఉన్నాయి. ఇప్పడు మణిరత్నం సినిమాలో మెయిన్ క్యారెక్టర్ మావాడే. ఇది హిస్టారికల్ మూవీ. రాజాకి దర్శకుడికిగా మంచి విజయాలు ఉన్నాయి. ‘హనుమాన్ జంక్షన్ ’ మూవీ 175 రోజులు ఆడింది. తమిళంలో ‘తన్నిఒరువన్’ ఎంత పెద్ద హిట్టో మీకు తెలుసు. ఇది తెలుగులో రాంచరణ్ హీరోగా ‘ధ్రువ’గా వచ్చింది. ఇప్పడు తెలుగులో కూడా చేయబోతున్నాడు. నా కూతురు రోజా దంతవైద్యురాలు. నేను చదువుకోకపోయినా పెళ్లయ్యాక మా ఆవిడను చదివించాను. డబుల్ ఎంఏ చేసింది. ఈ జన్మకు నాకీ సంతృప్తి చాలు.

జయం రవిని ‘బావ బావమరిది’ సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం చేశారు కదా. తెలుగులో హీరోగా ఎందుకు పరిచయం లేదు?

అవునండీ ఆ విషయంలో చాలా పెద్ద తప్పుచేశాను. హీరోగా తెలుగువాళ్లకు చూపిస్తాను. జయం సినిమా చూస్తే హీరో ఇంట్రడక్షన్ నాకు బాగా నచ్చింది. మా అబ్బాయి వయసుకు ఆ పాత్ర చాలా బాగుంటుంది అనుకున్నా. అందుకే ఆ కథను తమిళంలో చేయాల్సి వచ్చింది. బాంబేలో ఆరు నెలల ట్రైనింగ్ ఇచ్చి హీరో పరిచయంచేశా. నిజానికి తెలుగలోనే పరిచయం చేద్దామనుకున్నా. అది తప్పుకాదుగానీ వాడి లైఫ్ ఇప్పుడు మంచిగా సెట్ అయ్యింది. మా రవికి తమిళంలో సినిమాలన్నీ హిట్.

Tags: cinema celebrityeditor mohanproducer editor mohan interview
Previous Post

దెబ్బ కొట్టేందుకు రామ్మోహన్ ను రంగంలోకి దింపుతున్న కేటిఆర్!

Next Post

అనగనగా ఒక బెంజికారు.. అనేకానేక ప్రకంపనలు!!

Related Posts

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

Voluptuous Beauty Apsara Rani Will Make You Go Crazy!!!

Bollywood Actress Shama Sikander Hot and Sexy Photo Gallery

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

‘కరుణామయుడు’ వెనక ఎంతపెద్ద ‘షో’ నడిచిందో?

Lavanya Tripathi

ముఖ్య కథనాలు

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist