బాబ్రీ మసీదు కూల్చివేతలో ఎలాంటి కుట్ర కోణం లేదని సీబీఐ కోర్టు తేల్చేసింది. కుట్ర జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఈ విషయంలో బీజేపీ నాయకులు లాల్ కృష్ణ అద్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి లాంటి వారికి ఊరట లభించినట్లే.
ఈ తీర్పు సందర్భంగా నిందితులందరినీ బుధవారం కోర్టుకు హాజరుకావల్సిందిగా చెప్పారు. కోర్టు పరిసరాల్లో ఆంక్షలు విధించి.. భారీగా పోలీసులను మోహరించారు. 26 మంది నిందితులు కోర్టుకు హాజరుకాగా,.. ఆరుగురు గైర్హాజరయ్యారు. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి, కల్యాణ్ సింగ్, నృత్యగోపాల్ దాస్, సతీష్ ప్రధాన్ లకు మినహాయింపు ఇచ్చారు. కోవిడ్,వయసు రీత్యా కోర్టుకు ప్రత్యక్షంగా హాజరుకాలేమని, వీరు మినహాయింపు కోరారు.
కీలక తీర్పు
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కీలక తీర్పు వెలువరించింది. కూల్చివేత పథకం ప్రకారం చేయలేదు అని కోర్టు అభిప్రాయపడింది. పథకం ప్రకారం చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లేవు అని న్యాయమూర్తి తీర్పు సందర్భంగా పేర్కొన్నారు. సీబీఐ కోర్టు నిందితులందరినీ నిర్దోషులుగా తేల్చింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసు సీబీఐ కోర్టు కొట్టివేసింది.
మొత్తం 32 నిందితులలో 8 మంది బిజేపి నేతలు.
1) ఎల్.కే. అద్వాని.
2) మురళీ మనోహర్ జోషి.
3) ఉమా భారతి.
4) కల్యాణ్ సింగ్.
5) వినయ్ కటియార్.
6) సాక్షి మహారాజ్
7) లల్లూ సింగ్
8) బి.బి. శరణ్ సింగ్
అందరూ నిర్దోషులే
బాబ్రీ కూల్చివేత కేసులో లక్నోలో ఏర్పాటుచేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సురేంద్రకుమార్ యాదవ్ బుధవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో మొత్తం 49 మంది మీద తీవ్రమైన అభియోగాలు నమోదు అయ్యాయి. విచారణ జరుగుతున్న సమయంలోనే 17 మంది మరణించారు. 31 మంది మిగిలారు. వారిలో ఉద్ధండులైన భాజపా నాయకులు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి వంటి వారున్నారు. 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ జరిగింది.
ఈకేసు తుది తీర్పు సందర్భంగా నిందితులు అందరినీ కోర్టుకు రావాల్సిందిగా చెప్పారు. అయితే 26 మంది మాత్రం హాజరయ్యారు. అద్వానీ సహో వయోధికులైన వారు అనుమతి తీసుకున్నారు. ఉమాభారతి, కల్యాణ్ సింగ్ కరోనా కారణంగా రాలేదు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీర్పు సమయంలో వీరు హాజరయ్యారు.
మొత్తానికి వీరందరూ కూడా నిర్దోషులే అని సీబీఐ కోర్టు తేల్చింది. కూల్చివేతలో కుట్రకోణం లేదని పేర్కొంది. సీబీఐ కోర్టు తీర్పుతో భాజపా దళాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.











