యాంకర్ టర్న్ డ్ యాక్టరస్ అనసూయ భరద్వాజ్ ను తెలంగాణ చిత్రపురి చలన చిత్రోత్సవం తన పోస్టల్ స్టాంప్‌తో సత్కరించింది. ఈ వార్తను అనసూయ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియచేసింది. ఇంకా చెప్పాలంటే.. ఈ వార్తతో నెటిజన్లకు షాక్ ఇచ్చిందని చెప్పచ్చు. అంతే కాకుండా తన ఫోటోతో ఉన్న స్టాంప్ ను కూడా పోస్ట్ చేసి తన సంతోషాన్ని షేర్ చేసుకుంది. ఈసందర్భంగా అనసూయ స్పందిస్తూ.. నా జీవితంలో అపారమైన గౌరవం ఇది. నేను ఏం చేశానో తెలియదు కానీ.. చిత్రపురి ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి ఇలాంటి గౌరవం దక్కినందుకు గర్వపడుతున్నాను. గొప్ప పనులు కోసం నేను చేయాల్సినదంతా చేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని చెప్పింది అనసూయ.
ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే.. మాస్ మహారాజా నటిస్తున్న ఖిలాడి సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. రాక్షసుడు సినిమాతో సక్సస్ సాధించిన రమేష్ వర్మ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని మే 28న రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. అనసూయ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిరియాడిక్ మూవీలో కూడా నటిస్తుందని తెలిసింది.
ఇందులో పవర్ స్టార్ సరసన ఇస్మార్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్ నటిస్తుంది. ఆమె పాత్ర దాదాపు అరగంట సేపు ఉంటుందని టాక్ వినిపిస్తోంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో అనసూయ నటించే ఛాన్స్ దక్కించుకోవడం విశేషం. ఇలా.. ఓ వైపు బుల్లితెర మీద, మరో వైపు వెండితెర మీద దూసుకెళుతుంది అనసూయ.
Must Read ;- 3 నిమిషాల సాంగ్ కోసం అనసూయ అంత తీసుకుందా?











