ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల తరహాలోనే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హ*త్య కేసును కూడా నీరుగార్చేందుకు భారీ కుట్ర జరుగుతోందా? అంటే అవుననే అంటున్నారు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. గతంలో జరిగిన హైప్రొఫైల్ హ*త్య కేసుల్లో సాక్షులను అడ్డు తొలగించుకున్నట్లుగానే, ఇప్పుడు అనంతబాబు టీమ్ కూడా అదే సూత్రం పాటిస్తోందని మంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
పరిటాల రవి హ*త్య కేసులో కీలక సాక్షి రేకలయ్య నుంచి, వివేకా హ*త్య కేసులో అనుమానాస్పదంగా మర*ణించిన గంగాధర్ రెడ్డి వరకు..ఈ రెండు కేసుల్లోనూ సాక్షులు వరుసగా అదృశ్యం కావడం లేదా మర*ణించడం చూశాం. ఇప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులోనూ సరిగ్గా అదే రూట్ మ్యాప్‌ను నిందితుడు అనంతబాబు బృందం ఫాలో అవుతోందని మంత్రి సంధ్యారాణి ఆరోపిస్తున్నారు. అబద్ధపు సాక్ష్యం చెప్పాలని సాక్షులకు కోట్లు ఎరవేయడం, లొంగని పక్షంలో బెదిరింపులకు దిగడం వంటివి చూస్తుంటే..ఇది ఒక పథకం ప్రకారం జరుగుతున్న కుట్రగా కనిపిస్తోంది.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హ*త్య కేసులో ప్రధాన నిందితుడైన అనంతబాబు ఇప్పటికీ ఎమ్మెల్సీగా కొనసాగడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని సంధ్యారాణి మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ కనుసన్నల్లో పనిచేసిన పోలీసులు ఈ కేసును ఉద్దేశపూర్వకంగా నీరుగార్చారని సంధ్యారాణి ధ్వజమెత్తారు. మృ*తుడి శరీరంపై ఏకంగా 31 గాయాలు ఉన్నప్పటికీ, దానిని హ*త్యగా కాకుండా కేవలం అనుమానాస్పద మృ*తిగా నమోదు చేయడం పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ హ*త్యకు సంబంధించిన 60 కీలక వీడియోలు వెలుగులోకి వచ్చాయని, ఇప్పుడు ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి అనంతబాబు సాక్షులకు డబ్బు ఎరవేస్తున్నారని ఆమె ఆరోపించారు.
వివేకా హ*త్య జరిగినప్పుడు రక్తం మరకలను తుడిచేసి, గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం ఎలా జరిగిందో, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులోనూ పోలీసుల తీరు అలాగే ఉందన్నది మంత్రి వాదన. మృ*తుడి శరీరంపై 31 గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నా..గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసులు దీనిని అనుమానాస్పద మృ*తిగా నమోదు చేయడం వెనుక జగన్ ఆదేశాలే ఉన్నాయని ఆమె విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వెలుగులోకి వచ్చిన 60 వీడియోలు.. ఈ కేసులో జగన్ ప్రభుత్వం చేసిన డ్రామాని బట్టబయలు చేస్తున్నాయి.
వైసీపీ కార్యకర్తలు కూడా జగన్‌ను నమ్మి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సంధ్యారాణి హితవు పలికారు. గతంలో కోడికత్తి కేసులో దళిత యువకుడు శ్రీను ఏళ్ల తరబడి జైల్లో మగ్గిపోయినా జగన్ కనీసం పట్టించుకోలేదని ఆమె గుర్తు చేశారు. ఇప్పుడు రప్పా రప్పా అంటూ ప్లకార్డులు పట్టుకుని జైలుకు వెళ్లినా జగన్ ఎవరినీ ఆదుకోరని, కేవలం స్వార్థం కోసం కార్యకర్తలను బ*లి చేస్తారని ఆమె హెచ్చరించారు. అమ్మ, అమరావతి, ఆంధ్రప్రదేశ్ అన్న పదాలకు జగన్ డిక్షనరీలో గౌరవమే లేదని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.











