వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరాహార దీక్ష రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తనను కస్టడీలో హింసించిన పోలీసులను సస్పెండ్ చేయాలని, తన ఇల్లు, కార్యాలయంపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అంబటి ఈ దీక్షకు దిగారు. అయితే, ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో అంబటి నిరసన కార్యక్రమం కాస్తా అట్టర్ ఫ్లాప్ షోగా మిగిలిపోయింది..
దీక్షా వేదిక వద్ద దృశ్యాలు చూస్తుంటే అంబటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వేదిక మీద 15 మంది నాయకులు మినహాయిస్తే, వేదిక ముందు ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. కనీసం సొంత నియోజకవర్గ కార్యకర్తలు కూడా అంబటికి మద్దతు తెలిపేందుకు రాలేదు..
గతంలో సీఎం చంద్రబాబు నాయుడిపై అంబటి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, ఆపై టీడీపీ శ్రేణుల నిరసనలు, తదనంతరం జరిగిన పోలీసు అరెస్టుతో అంబటి రాంబాబు 18 రోజుల పాటు జైలులో గడిపారు. సానుభూతి కోసం అంబటి చేస్తున్న ప్రయత్నాలకు వైసీపీ అగ్ర నాయకత్వం నుండి గానీ, జిల్లా కీలక నేతల నుండి గానీ ఎటువంటి మద్దతు లభించలేదు..
ఇక, సోషల్ మీడియాలో అంబటి దీక్షపై సెటైర్లు పేలుతున్నాయి. అసెంబ్లీలో వైసీపీకి 11 సీట్లు వచ్చాయని, కానీ అంబటి దీక్షకు కనీసం 11 మంది కార్యకర్తలు కూడా రాలేదంటూ ప్రత్యర్థి పార్టీల నేతలు ఎద్దేవా చేస్తున్నారు. మొత్తానికి అంబటి రాంబాబు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమం ఆయన రాజకీయ ఉనికిని చాటుకోవడానికి బదులు.. పార్టీలో అంబటి ఒంటరితనానికి అద్దం పట్టింది..











