మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’. ఈ సినిమాకి డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వం వహించారు. రికార్డు కలెక్షన్స్ వసూలు చేసింది ఈ సినిమా. దీన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించారు. ఈ సినిమాతోనే చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. అయితే.. చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ తర్వాత సినిమాని అయినా.. వేరే సంస్థలో చేస్తారనుకుంటే.. వరుసగా కొణిదెల ప్రొడక్షన్ లోనే సినిమాలు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. చరణ్ తన తండ్రి కోసమే ఈ బ్యానర్ ను స్టార్ట్ చేశారట.

‘ఖైదీ నెంబర్ 150’ తర్వాత చిరంజీవి పాన్ ఇండియా మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ చేశారు. స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. బిగ్ బి అమితాబ్ కీలక పాత్ర పోషించడం తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమాని కూడా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై చరణే నిర్మించారు. అయితే.. సైరా నరసింహారెడ్డి సినిమా తెలుగు రాష్ట్రాల్లో రికార్డు కలెక్షన్స్ రాబట్టింది కానీ.. తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆశించినంతగా ఆకట్టుకోలేదు. దీంతో ఈ సినిమా కి దాదాపు 70 కోట్లు నష్టం వచ్చిందట.
అందుకనే చిరంజీవి ‘ఆచార్య’ సినిమా నిర్మాణ బాధ్యతలను మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డికి అప్పగించారట. ఆచార్య సినిమాని మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే.. ఇక నుంచి తన సినిమాలను బయట బ్యానర్ లోనే చేయాలని నిర్ణయం తీసుకున్నారట. కారణం ఏంటంటే.. తనయుడు చరణ్ నష్టపోకూడదు అనే ఇలా ప్లాన్ చేశారట చిరు. ‘వేదాళం’ రీమేక్ ని అనిల్ సుంకర బ్యానర్ లో చేస్తున్నారు. ‘లూసీఫర్’ రీమేక్ ని ఎన్వీ ప్రసాద్ బ్యానర్ లో చేస్తున్నారు. అదీ.. సంగతి.
Must Read ;- తమిళ దర్శకుడి చేతికి మెగాస్టార్ ‘లూసిఫర్’ రీమేక్











