ఏసీబీ డైరక్టర్ జనరల్ గా గత ప్రభుత్వ హయాంలో విధులు నిర్వర్తించిన ఏబీ వెంకటేశ్వరరావు.. అమరావతిలోని ఏపీ ఛాప్టర్, ఐపీఎస్ అధికార్ల సంఘ కార్యదర్శికి తాజాగా రాసిన ఒక లేఖ ఇప్పుడు రాజకీయ, బ్యూరోక్రాట్ వర్గాల్లో సంచలనంగా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తనను వేధిస్తున్నదని ఆరోపిస్తూ తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ఈ లేఖ రాశారు.
ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజునే.. అంటే.. 2019 మే 30వ తేదీనాడే తనను ఏసీబీ డైరక్టర్ జనరల్ పదవినుంచి బదిలీ చేసి.. జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వులు వచ్చాయని ఏబీ వెంకటేశ్వరరావు గుర్తు చేశారు. అప్పటినుంచి ఏడునెలలపాటు తనకు పోస్టింగు ఇవ్వకుండా, వేతనం కూడా లేకుండా వేధించారనే అంశం దగ్గరినుంచి అనేక విషయాలను ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. కోర్టు కేసులతో సహా ఎన్ని రకాలుగా తనను ప్రభుత్వం వేధిస్తున్నదో ఆయన వివరించారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తులు పంపినా వాటిని పట్టించుకోలేదని కూడా పేర్కొన్నారు.
తనకు న్యాయం జరగాలంటే.. ఐపీఎస్ అధికార్ల సంఘం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి.. ఈ వేధింపుల గురించి చర్చించాలని ఆయన ఆ లేఖలో కోరారు. ఈ లేఖ ప్రతులను- న్యూ ఢిల్లీలోని కేంద్ర ఐపీఎస్ అధికార్ల సంఘానికి కూడా పంపారు. కార్యనిర్వహక కమిటీ లేదా, సర్వసభ్య సమావేశం ఎదుట ఈ లేఖను ఉంచి చర్చించాల్సిందిగా కోరారు.
ఏబీ వెంకటేశ్వరరావు రాసిన లేఖ పూర్తి పాఠం ఇక్కడ చదవండి :













