మెగాస్టార్ చిరంజీవి – బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘ఆచార్య’. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. చిరు సరసన కాజల్ నటిస్తుంటే.. చరణ్ సరసన రష్మిక నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి కానీ.. ఇంకా అఫిషియల్ గా ప్రకటించలేదు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా కథ వివాదస్పదం అవ్వడం.. దీనికి కొరటాల గట్టిగానే సమాధానం చెప్పడం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ‘ఆచార్య’ కథ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే.. కొన్ని యదార్థ సంఘటనలు ఆధారంగా ఈ సినిమా కథ రాసుకున్నారట కొరటాల. దేవాదయ భూములు, నక్సలిజం నేపథ్యంలో సాగే కథని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గట్టుగా చిరు క్యారెక్టర్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు లీకవ్వడంతో ప్రచారంలో ఉన్నది నిజమే అనిపించింది.
ఇప్పుడు దేవదాయ, నక్సలిజం నేపథ్యం అనేది మరింత క్లారిటీ వచ్చింది. ఇంతకీ.. యదార్థ సంఘటనలు ఎక్కడ జరిగాయంటే.. తమిళనాడులోని ధర్మపురిలో జరిగాయని.. అక్కడ జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా కొరటాల ఈ కథని రాసుకున్నారని తెలిసింది. చిరు, చరణ్ కలిసి నటిస్తుండడం.. అపజయం అనేది లేని కొరటాల దీనికి దర్శకుడు కావడంతో.. ‘ఆచార్య’ పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ఆచార్య’ చిత్రాన్ని సమ్మర్ కి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.