చూస్తుంటే శ్రుతిహాసన్ జోరుపెరగనున్నట్టే కనిపిస్తోంది. ఆమె కెరియర్ కి మళ్లీ శుభశకునాలే కనిపిస్తున్నాయి. ప్రభాస్ జోడీగా ‘సలార్‘ సినిమాలో ఛాన్స్ కొట్టేయడమే అందుకు నిదర్శనం. తెలుగు .. తమిళ భాషల్లో శ్రుతి హాసన్ స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. అందాలన్నీ పొందికగా కూర్చినట్టు దానిమ్మ మొగ్గలా కనిపించే ఈ సుందరికీ యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. అలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్ బాట పట్టిన ఈ బ్యూటీ, అక్కడ అంతగా రాణించలేకపోయింది. అంటే ప్రేమలో పడిపోయి ఆమె కెరియర్ ను పక్కన పెట్టేసింది.
అలా ఉన్న అవకాశాలు వదులుకుని .. కొత్త అవకాశాల కోసం పరిగెత్తిన ఆమె చివరికి ఒంటరిగా మిగిలిపోయింది. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ తమిళ .. తెలుగు భాషల్లో ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది. తెలుగు ఇండస్ట్రీ ఆమెకి మళ్లీ గ్రాండ్ వెల్ కామ్ చెప్పింది. రవితేజ జోడీగా ఆమె నటించిన ‘క్రాక్’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. దాంతో శ్రుతి హాసన్ కి రీ ఎంట్రీ కలిసొచ్చిందని అంతా అనుకున్నారు. ‘వకీల్ సాబ్’ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను చేసిన ఆమె, ఏకంగా ప్రభాస్ సరసన ఛాన్స్ కొట్టేస్తుందని ఎవరూ అనుకోలేదు.
ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘సలార్’ సినిమాను రూపొందిస్తున్నాడు. రేపటి నుంచి ఈ సినిమా షూటింగ్ గోదావరిఖని బొగ్గుగనుల్లో జరగనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రుతి హాసన్ నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అవునా? కాదా?అనే సందేహం మాత్రం అలాగే ఉండిపోయింది. తాజాగా ఆ సందేహాలకు తెరపడిపోయింది. ఈ రోజున శ్రుతి హాసన్ పుట్టినరోజు కావడంతో, ఆమెకి శుభాకాంక్షలతో కూడిన వెల్ కమ్ చెబుతూ ‘సలార్’ టీమ్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ పాన్ ఇండియా సినిమాతో శ్రుతి మళ్లీ దూసుకుపోతుందేమో చూడాలి.
Must Read ;-, మోటార్ బైక్ పై భామతో ‘వకీల్ సాబ్’ ఫుల్ జోష్
Wish you a very happy birthday @shrutihaasan 🎉
We're ecstatic to have you onboard for #Salaar. Can't wait to see you sizzle on the screen. #Prabhas @prashanth_neel @VKiragandur @hombalefilms pic.twitter.com/Zkx5xL3YmP
— Hombale Films (@hombalefilms) January 28, 2021











