రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు.. పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం సెట్స్ మీదున్న రాధేశ్యామ్ తో సహా.. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందించనున్న ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలు పాన్ ఇండియా కేటగిరిలోనే భారీ ఖర్చుతో తెరకెక్కబోతున్నాయి. అయితే ఈ లిస్ట్ లో ఉన్న మరో పాన్ ఇండియా సినిమా కోసం దేశం మొత్తం చాలా క్యూరియాసిటీతో ఎదురుచూస్తోంది. సినిమా పేరు సలార్. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో త్వరలో షూటింగ్ ప్రారంభించనున్న ఈ సినిమా ఈ రోజే చాలా గ్రాండ్ గా లాంఛ్ అయింది.

ఈ కార్యక్రమానికి ‘కేజీఎఫ్’ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న కన్నడ హీరో యశ్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. కేజీఎఫ్ ను నిర్మించిన హోం బలే బ్యానర్ లో ఈ సినిమా రూపొందనుంది. ఈ విషయాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రివీల్ చేశాడు. సలార్ సినిమా నిర్మించే అవకాశమిచ్చిన హోం బలే ఫిలింస్ వారికి ధన్యవాదాలు తెలిపాడు. అలాగే.. ముఖ్య అతిథి యశ్ కు కూడా కృతజ్ఞతలు తెలిపాడు.
Must Read ;- ప్రభాస్ విలన్ గా జాన్ అబ్రహం.. ఏ సినిమా?
https://twitter.com/prashanth_neel/status/1349976826261618690











