శ్రుతి హాసన్ మళ్లీ రెచ్చగొడుతోంది .. చేపపిల్లలా తళుక్కున మెరుస్తూ, అగ్గిపుల్లలా గుండె గుడిసెలను అంటించేస్తోంది. అవునూ ఇదంతా జరిగింది .. ‘క్రాక్’ ట్రైలర్ లోనే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా ‘క్రాక్’ సినిమా రూపొందింది. త్వరలోనే ప్రేక్షకులను పలకరించడానికి ఈ సినిమా ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను వదిలారు. ఈ సినిమాలో రొమాన్స్ పరంగా శ్రుతి హాసన్ రెచ్చిపోయిందనే విషయం ఈ ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. కవ్విస్తూ .. ఊరిస్తూ స్క్రీన్ అంతా దున్నేసిందనే విషయం అర్థమవుతోంది. ఆ మాత్రం మసాలా గుప్పించకపోతే, కెరియర్ గ్రాఫ్ పుంజుకోవడం కష్టమనే సంగతి ఆమెకి బాగా తెలుసు.
కందిరీగల్లాంటి కళ్లతో తేనె టీగలా కనిపించే శ్రుతిహాసన్, మొదటి నుంచి కూడా గ్లామర్ పరంగా మడికట్టుకుని కూర్చున్నది లేదు. మాస్ ఆడియన్స్ కోసం అన్నప్పుడు ఆమె దుమ్మురేపేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందువల్లనే మాస్ ఆడియన్స్ కూడా ఆమె వలపు వాకిళ్లలో కళ్లను పేర్చేసి కూర్చుంటారు. ‘క్రాక్’ సినిమా కూడా మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకునే తెరకెక్కించిన సినిమా కావడం వలన, ఆమె ఆ రేంజ్ లో రెచ్చిపోయిందని అంటున్నారు. అయితే తెలుగులో మళ్లీ నిలబడాలనే ఉద్దేశంతోనే ఆమె మరికాస్త ఉత్సాహాన్ని చూపించిందనే టాక్ వినిపిస్తోంది.
రవితేజ సరసన శ్రుతిహాసన్ నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్, త్వరలో భారీ స్థాయిలో థియేటర్స్ లోకి దిగబోతోంది. ఏప్రిల్ నెలలో ‘వకీల్ సాబ్’ సినిమాతోనూ పలకరించనుంది. ఆ తరువాత ప్రాజెక్టులే ఇప్పుడు శ్రుతికి కావాలి. ఒకటి రెండు ప్రాజెక్టులలో ఆమె పేరైతే వినిపిస్తోందిగానీ అవి ఎంతవరకూ ఖరారనేది తెలియదు. ఇకపై శ్రుతి సీనియర్ హీరోలతోనే కెరియర్ ను నెట్టుకు రావాలసి ఉంటుందేమో. ఎందుకంటే కుర్ర హీరోలతో కలిసి కుమ్మేయడానికి, కృతిశెట్టి .. అనన్య పాండే .. ప్రియాంక అరుళ్ మోహన్ వంటి పాపలు పడుచు హృదయాలపై పాదాలు మోపేశారు. ఈ కొత్త పాలపుంతలను దాటుకుని శ్రుతి ఎంతవరకూ ముందుకు వెళుతుందన్నది చూడాలి మరి.