రెబెల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా సినిమా రంగంలో ఉండి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎదిగిన సంగతి తెలిసిందే. ప్రభాస్ చాలా సినిమా చేసినా ఇద్దరూ కలిసి నటించిన సినిమాలు చాలా తక్కువేనని చెప్పాలి. దానికి కారణం కృష్ణంరాజు రాజకీయాల్లో బిజీగా ఉండటం కూడా కొంత కారణం. తాజా సమాచారం ఏమిటంటే మరో రెండు సినిమాల్లో కృష్ణంరాజు ప్రభాస్ తో కలిసి నటించనుండటం.
ఈ వార్త అధికారికం కాకపోయినా సినిమా వర్గాల ద్వారా తెలుస్తోంది. 2007 లో ‘బిల్లా’ చిత్రంలో ప్రభాస్ తో కలిసి కృష్ణంరాజు నటించారు. ఆ తర్వాత ‘రెబెల్’ చిత్రంలోనూ కలిసి నటించారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ‘రాధేశ్యామ్’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ కీలక పాత్రను కృష్ణంరాజు పోషించినట్టు తెలిసింది. అలాగే మరో పాన్ ఇండియా సినిమా ‘ఆదిపురుష్’లోనూ కృష్ణంరాజు నటించబోతున్నట్టు సమాచారం.
ఇందులో దశరధుడి పాత్రను ఆయన పోషించబోతున్నారట. బహుశా ఆయన గడ్డం పెంచడంలో అంతరార్థం కూడా అదే కావచ్చు. కృష్ణంరాజు వయసు 81 ఏళ్లు నిండాయి. ఆయనకు ఎప్పటి నుంచో ఓ చిరకాల కల ఉంది. ‘విశాల నేత్రాలు’ అనే సినిమాని తన గోపీకృష్ణా బ్యానర్ మీద చేయాలని ఆయన కలలు కంటున్నారుగానీ అది కార్యరూపం దాల్చడం లేదు.
Must Read ;- తెలుగు తెర రెబల్ స్టార్ .. కృష్ణంరాజు (జన్మదిన ప్రత్యేకం)