ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా మూవీస్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. అన్నీ భారీ బడ్జెట్ మూవీసే. అంతటా ఆసక్తిని పెంచేవే. అందులో ‘సలార్’ మూవీ ఒకటి. కన్నడ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే మూవీస్ బ్యానర్ పై కళ్ళు చెదిరే రీతిలో రిచ్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి ‘కెజీయఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా లాంచ్ అయిన ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు రెడీ అవుతోంది.

అయితే ఈ సినిమాలో కథానాయిక విషయంలో అభిమానులందరూ చాలా ఆత్రుతగా ఉన్నారు. ప్రభాస్ చేస్తోన్న సినిమాలన్నీ పాన్ ఇండియా కేటగిరిలో రూపొందుతున్నాయి కాబట్టి.. మార్కెట్ దృష్యా బాలీవుడ్ బ్యూటీస్ ను కథానాయికలుగా తీసుకోవడం పరిపాటిగా మారింది. సాహో లో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అలాగే.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో దీపికా పదుకొనే ఫైనల్ అయింది. ఇక ఓం రౌత్ ఆదిపురుష్ లో కూడా బాలీవుడ్ బ్యూటీనే హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ నేపథ్యంలో ‘సలార్’ లో కూడా ప్రభాస్ తో బాలీవుడ్ హీరోయిన్ రొమాన్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ కే నైఫ్ లాంటి హీరోయిన్ కత్రినా కైఫ్. నిజానికి కత్రినా కైఫ్ తన కెరీర్ లో కథానాయికగా నటించిన మొదటి సినిమా ‘మల్లీశ్వరి’ అన్న సంగతి తెలిసిందే.అలాగే.. ఆ తర్వాత బాలయ్య సరసన ‘అల్లరి పిడుగు’లోనూ నటించింది. ఆ తర్వాత ఆమె బాలీవుడ్ లో స్థిరపడిపోయింది. దాదాపు పదిహేనుళ్ళ తర్వాత ఇప్పుడు మరోసారి టాలీవుడ్ లో కత్రినా కథానాయిక గా నటించడానికి రెడీ అవుతుండడం ఆసక్తిని కలిగిస్తోంది. ముందుగా హీరోయిన్ గా దిశా పటానీ పేరు వినిపించింది. కానీ ఇప్పుడు కత్రినా కైఫ్ నే కథానాయికగా ఖాయం చేయబోతున్నారట. మరి కత్రినా, ప్రభాస్ జోడీ ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.
Must Read ;- హీరో ఎలివేషన్ కేక.. ప్రశాంత్ నీల్ తోపు











