‘బాహుబలి’ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే దృశ్యం “మహేంద్ర బాహుబలి బ్రతకాలి ” అంటూ రమ్యకృష్ణ ఒక పసిబిడ్డను రెండు చేతులతో పైకి ఎత్తి పట్టుకుని ప్రవాహానికి ఎదురు వెళ్లడం. పైకి ఎత్తబడిన ఆ రెండు చేతుల్లోని పసిబిడ్డ పోస్టర్ కూడా విపరీతంగా పాపులర్ అయింది. అమరేంద్ర బాహుబలి – దేవసేనకు జన్మించిన మహేంద్ర బాహుబలిని బ్రతికించుకోవడం కోసం, ‘శివగామి’ పాత్రధారి అయిన రమ్యకృష్ణ ప్రాణత్యాగం చేస్తుంది. అద్భుతమైన ఆ దృశ్యం ప్రేక్షకుల మనోఫలకాలపై నుంచి ఇప్పటికీ చెదిరిపోలేదు.
ఆ సినిమా చూస్తున్నప్పుడు దేవసేన బిడ్డగా జన్మించి, శివగామిచే రక్షించబడిన ఆ పసిబిడ్డ ఎవరోనని అంతా అనుకున్నారు. పసితనంలోనే ఇంతటి భారీచిత్రంలో .. గొప్ప చిత్రంలో కనిపించే అవకాశాన్ని కొట్టేసిందని చెప్పుకున్నారు. పసితనంలో మహేంద్ర బాహుబలిగా కనిపించే అదృష్టాన్ని పొందిన ఆ శిశువు పేరు ‘తన్వి’. ఇదిగో క్యూట్ గా ఈ ఫొటోలో కనిపించే పాప తనే. ప్రస్తుతం ఎగువ కిండర్ గార్డెన్ చదువుతోంది. దేవసేన .. శివగామి .. కట్టప్ప చేతులతో ఎత్తుకోబడిన ఈ అమ్మాయికి తమ కాలనీలోను .. స్కూల్లోను విపరీతమైన క్రేజ్ ఉందట!
తను ఎంత భారీ చిత్రంలో కనిపించింది .. ఎంత గొప్ప కాంబినేషన్లో మెరిసింది అనే విషయం ‘తన్వి’కి అర్థం కావాలంటే ఇంకాస్త ఎదగాలి. పసిపాపగా ఉన్నప్పుడే రాజమౌళి దర్శకత్వంలో కనిపించే ఛాన్స్ కొట్టేసిందంటే మామూలు విషయం కాదు. ఆ పాప పేరెంట్స్ కి కూడా ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ తీపి జ్ఞాపకమే. మరి తన్వి చదువు పూర్తిచేసిన తరువాత సినిమాల్లో చేస్తుందా? ‘బాహుబలి‘లో కనిపించానని గర్వంగా చెప్పుకుంటూ ఉద్యోగమే చేసుకుంటుందా? అనేది చూడాలి.
Must Read ;- నెగెటివ్ షేడ్స్ తో మెప్పించిన దేవసేన వదినమ్మ











