వైసీపీలో అసమ్మతి సెగలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆనం కుటుంబీకుల మార్క్ చూపిస్తామని వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఛాలెంజ్ చేశారు. ఎప్పటి నుంచో వైసీపీ అధినేతపై ఆనం తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు అనుభవించిన ఆనం రామనారాయణరెడ్డి, రాష్ట్ర విభజన తరువాత కొన్నాళ్లు టీడీపీలో కొనసాగారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి వెంకటగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే, ఎలాంటి పదవి దక్కకపోగా ఆనం రామనారాయణరెడ్డిని వైసీపీ జిల్లా నేతలు సహా అందరూ పట్టించుకోవడమే మానేశారని తెలుస్తోంది. దీంతో ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరని తాజాగా ఆనం చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆనం వివేకానందరెడ్డి చనిపోయిన తరువాత ఆనం కుటుంబం నెల్లూరు నగరానికి బాగా దూరమైందనే వాదనలు వినిపించాయి. దీంతో ఆనం తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
Must Read ;- నన్నేం పీకలేరు!.. అనిల్ లేటెస్ట్ బూతు ఎటాక్!











